Share News

కొత్తగా 4.89 లక్షల మందికి పింఛన్ల సొమ్ము

ABN , Publish Date - Nov 27 , 2026 | 05:52 AM

రాష్ట్రంలో కొత్తగా పింఛన్లు మంజూరైన 4,89,233 మంది బ్యాంకు ఖాతాలల్లో నగదు జమ అయింది.

కొత్తగా 4.89 లక్షల మందికి పింఛన్ల సొమ్ము
cash

హైదరాబాద్‌, నవంబరు 26, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్తగా పింఛన్లు మంజూరైన 4,89,233 మంది బ్యాంకు ఖాతాలల్లో నగదు జమ అయింది. సీఎం రేవంత్‌రెడ్డి గురువారం నాటి అచ్చంపేట బహిరంగసభలో పింఛన్ల విడుదల ప్రకటన చేసి కొద్దిమందికి ఆయన చేతుల మీదుగా ధ్రువ పత్రాలు అందించారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లబ్ధిదారులందరి ఖాతాల్లోకి నగదును ప్రభుత్వం బదిలీ చేసింది. దీనిని నవంబరు నెల పింఛనుగా ప్రభుత్వం పరిగణించింది. వీరికి మళ్లీ డిసెంబరులో పాత లబ్ధిదారులందరితో కలిసి అందనుంది. మరోవైపు కొత్తగా పింఛన్లు అందుకున్న వారిలో 70శాతం మంది వితంతువులు, ఒంటరి మహిళలే ఉన్నారు. మరోవైపు ఇవి కాకుండా పింఛను తీసుకుంటున్న భార్య చనిపోతే భర్తకు, భర్త చనిపోతే భార్యకు ఇచ్చే ఇన్‌స్టంట్‌ పింఛన్లు 1,23,625 ఉన్నాయి. దీంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక ఇచ్చిన కొత్త పింఛన్లు మొత్తంగా 6,12,858 అని సెర్ప్‌ అధికారులు తెలిపారు.

కొత్తగా ఫించన్లు

అందుకున్న వారు (కేటగిరీల వారీగా)

వితంతువులు 2,89,713

ఒంటరి మహిళలు 53,841

దివ్యాంగులు 1,00,273

కల్లుగీత కార్మికులు 27,437

ఎయిడ్స్‌ బాధితులు 2938

చేనేత కార్మికులు 4450

పైలేరియా వ్యాధిగ్రస్థులు 6375

డయాలసిస్‌

చేయించుకునేవారు 1970

ప్రజావాణిలో వచ్చిన

ఇతర విభాగాల వారు 2236

Updated Date - Nov 27 , 2026 | 05:53 AM