అగ్నిప్రమాదాలు జరగకుండా.. డేటా సెంటర్లు పటిష్ఠచర్యలు చేపట్టాలి
ABN , Publish Date - Oct 30 , 2026 | 04:27 AM
రాష్ట్రంలో ఏర్పాటు అవుతున్న డేటా సెంటర్లలో అగ్నిప్రమాదాలు జరగకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలని అగ్నిమాపక శాఖ ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది.
అగ్నిమాపక శాఖ ప్రత్యేక మార్గదర్శకాలు
హైదరాబాద్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఏర్పాటు అవుతున్న డేటా సెంటర్లలో అగ్నిప్రమాదాలు జరగకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలని అగ్నిమాపక శాఖ ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. డేటా సెంటర్లలో భద్రతా చర్యలకు సంబంధించి అగ్నిమాపక శాఖ డీజీ విక్రమ్ సింగ్ మాన్ అగ్నిమాపక, ప్రాణ రక్షణ భద్రతా మార్గదర్శకాలను జారీ చేశారు. రాష్ట్రంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో, ఈ మార్గదర్శకాలు వ్యాపార నిర్వహణ సౌలభ్యాన్ని (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్), వ్యాపార కార్యకలాపాల వేగవంతమైన నిర్వహణను (స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) ప్రోత్సహించనున్నాయి. అగ్ని వ్యాప్తిని నిరోధించే విభజనలు, అగ్నిమాపక సిబ్బంది వినియోగించే ప్రత్యేక మెట్లను ఏర్పాటు చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. అత్యవసర సమయంలో సురక్షిత ప్రదేశాలు, తగినంత అగ్నిమాపక నీటి నిల్వలు, పంపింగ్ సదుపాయాలను ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. డేటా సెంటర్లలో ప్రత్యేక ప్రమాద నివారణ, రక్షణ చర్యలు అవసరమని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఉత్తర్‌ప్రదేశ్‌లో సంచలనం.. ఇంట్లో పాతిపెట్టిన మూడు డ్రమ్ముల్లో భారీగా నగదు..!
ఢిల్లీ టీటీడీలో వైభవంగా ప్రారంభమైన వార్షిక పవిత్రోత్సవాలు