క్రిటికల్ మినరల్స్ పరిశోధనలో‘త్రిముఖ’ భాగస్వామ్యం మోనాష్, ఐఐటీ హైదరాబాద్, సింగరేణి సంయుక్తంగా ముందడుగు: డిప్యూటీ సీఎం భట్టి
ABN , Publish Date - Sep 02 , 2026 | 05:09 AM
భారత్ పునరుత్పాదక ఇంధన రంగంలో విస్తరిస్తున్న తరుణంలో క్రిటికల్ మినరల్స్‌కు ప్రాధాన్యం పెరుగుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు
హైదరాబాద్, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): భారత్ పునరుత్పాదక ఇంధన రంగంలో విస్తరిస్తున్న తరుణంలో క్రిటికల్ మినరల్స్‌కు ప్రాధాన్యం పెరుగుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తెలంగాణ వీటికి వినియోగదారుగా మాత్రమే ఉండకూడదని, మొత్తం ప్రక్రియలో కీలక భాగస్వామిగా ఎదగాలని ఆకాంక్షించారు. క్రిటికల్ మినరల్స్, ఖనిజాన్వేషణ, అధునాతన ఖనిజ సాంకేతికతల రంగాల్లో దీర్ఘకాలిక పరిశోధన, సంస్థాగత భాగస్వామ్యాన్ని అభివృద్థి చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. దీనిపై మంగళవారం ప్రజాభవన్‌లో భట్టి.. మోనాష్ యూనివర్సిటీ డీన్, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మోనాష్ యూనివర్సిటీ, ఐఐటీ హైదరాబాద్, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సంయుక్తంగా క్రిటికల్ మినరల్స్ రంగంలో పరిశోధనను వేగవంతం చేయడంపై చర్చించారు. ఈ భాగస్వామ్యానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను త్వరగా రూపొందించాలని అధికారులను కోరారు. ఐఐటీ హైదరాబాద్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను బలోపేతం చేసి అధునాతన పరిశోధన, సాంకేతిక అభివృద్థికి వేదికగా మలచాలని భట్టి చెప్పారు. పునరుత్పాదక ఇంధనం, విద్యుత్ వాహనాలు, బ్యాటరీ నిల్వ వ్యవస్థలు, ఎలక్ర్టానిక్స్ రంగాలకు అవసరమైన ముడి పదార్థాల కొరతను అధిగమించడానికి ఈ భాగస్వామ్యం దోహదపడుతుందని చెప్పారు.
ఇవి కూడా చదవండి
క్రికెట్‌లో కోహ్లీనే మెస్సి, రొనాల్డో.. థాయ్ ఇన్‌ఫ్లుయెన్సర్ వీడియో వైరల్
పోలవరం నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. చంద్రబాబు చేతుల మీదుగా విడుదల