Share News

రేపు మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్‌ భేటీ

ABN , Publish Date - Oct 22 , 2026 | 05:54 AM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు

రేపు మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్‌ భేటీ
RevanthReddy

  • పాల్గొననున్న డిప్యూటీ సీఎం,

  • టీపీసీసీ అధ్యక్షుడు

  • ఎల్‌నినో పరిస్థితులు..

  • తీసుకోవాల్సిన చర్యలపై చర్చ

హైదరాబాద్‌, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. రాష్ట్రంలో నెలకొన్న ఎల్‌నినో పరిస్థితులు, రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో ఇండీ కూటమి ఆధ్వర్యంలో నవంబరు 1న జరగనున్న భారీ ర్యాలీపై ఈ భేటీలో చర్చించనున్నారు. ప్రగతి భవన్‌లో జరగనున్న ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌తోపాటు డీసీసీ అధ్యక్షులు కూడా పాల్గొననున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభా వం ఏయే ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది, ప్రభు త్వం తరఫున తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలేంటన్న దానిపై ఈ సమావేశంలో సమీక్షించనున్నారు. అలాగే నవంబరు 1న ఎస్‌ఐఆర్‌కు వ్య తిరేకంగా ఢిల్లీలో జరగనున్న భారీ ర్యాలీలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర ముఖ్య నేతలు తప్పనిసరిగా పాల్గొనాల్సిన ఆవశ్యకతను ముఖ్యమంత్రి వివరించనున్నారు. ఇక మార్చిలో జరగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదు ప్రక్రియ నవంబరు 6న ముగియనుంది. ఈ నేపథ్యంలో పార్టీ తరఫున ఓటరు నమోదు కార్యాచరణ వేగవంతం చేయడంపై రెండు నియోజకవర్గాల పరిధిలోని ఆరు ఉమ్మడి జిల్లాల ఎంపీ లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్‌చార్జి మంత్రుల కు సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు.

Updated Date - Oct 22 , 2026 | 05:56 AM