Share News

మైసూరు దసరా ఉత్సవాల్లో రేవంత్‌

ABN , Publish Date - Oct 22 , 2026 | 06:00 AM

ప్రతిష్ఠాత్మక మైసూరు దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి.

మైసూరు దసరా ఉత్సవాల్లో రేవంత్‌
RevanthReddy

బెంగళూరు/హైదరాబాద్‌ అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): వేడుకలకు ప్రత్యేక అతిథులుగా తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి, కేరళ సీఎం వీడీ సతీశన్‌ హాజరయ్యారు. రేవంత్‌రెడ్డి కుటుంబసమేతంగా వేడుకల్లో పాల్గొన్నారు. జంబూసవారి కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఇద్దరు సీఎంలను కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌ సాదరంగా ఆహ్వానించారు. మైసూర్‌ ప్యాలెస్‌ వద్ద బుధవారం సాయంత్రం నుంచి రాత్రివరకు సాగిన వేడుకలను ముగ్గురు సీఎంలు, శాండల్‌వుడ్‌ నటీనటులు, ప్రముఖులు తిలకించారు. నాడదేవత చాముండేశ్వరిదేవిని 750 కిలోల బంగారం అంబారిపై కొలువుదీర్చగా, గజరాజు ప్రశాంత మోసింది. జంబూసవారిలో వివిధశాఖల శకటాలు ఆకట్టుకున్నాయి. దసరా ఉత్సవాలకు తొలిసారి శాండల్‌వుడ్‌కు చెందిన సినీరంగ ప్రముఖులందరినీ ఆహ్వానించారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా వేలాది మంది పోలీసులను బందోబస్తుకు కేటాయించారు.

Updated Date - Oct 22 , 2026 | 06:08 AM