Share News

పని చేయకపోతే పదవులు ఎందుకు?.. తెలంగాణ బీజేపీ నేతలకు సునీల్ బన్సల్ ప్రశ్న

ABN , Publish Date - Oct 24 , 2026 | 06:42 PM

తెలంగాణ బీజేపీ నేతలకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ సునీల్ బన్సల్ హెచ్చరికలు జారీ చేశారు. పని చేయనప్పుడు పదవులు ఎందుకని, బాధ్యతలు నిర్వర్తించలేకపోతే ఇతరులకు అవకాశం ఇవ్వాలని స్పష్టం చేశారు.

పని చేయకపోతే పదవులు ఎందుకు?.. తెలంగాణ బీజేపీ నేతలకు సునీల్ బన్సల్ ప్రశ్న
Sunil Bansal Warning Telangana BJP Leaders

హైదరాబాద్, అక్టోబర్ 24: పని చేయనప్పుడు పోస్టులు ఎందుకని, బాధ్యతలు నిర్వర్తించలేకపోతే వేరే వాళ్లకు ఆ పదవులు ఇచ్చేయాలని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ సునీల్ బన్సల్ తెలంగాణ నేతలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ అంటే కేవలం హైదరాబాద్ ఒక్కటే కాదని, నాయకులు కేవలం హైదరాబాద్‌లోని స్టేట్ ఆఫీస్‌లో తిరిగితే సరిపోదని, గ్రౌండ్ స్థాయి వరకు వెళ్లాలని స్పష్టం చేశారు.

బహిరంగ సభల్లో పెద్ద పెద్ద ప్రసంగాలు చేయడం వల్ల వచ్చే ఇంపాక్ట్ కంటే, నేరుగా ప్రజల్లోకి వెళ్లి చిన్న సమూహాల వద్దకు చేరి నలుగురితో కలిసి చాయ్ తాగుతూ మాట్లాడితే వచ్చే ప్రభావం చాలా గట్టిగా ఉంటుందని బన్సల్ సూచించారు. పార్టీ అధిష్టానం ఇచ్చిన కార్యక్రమాల్లో కనీసం రెండు మూడు కార్యక్రమాలనైనా పరిపూర్ణంగా అమలు చేయకపోతే ఎలా అని బన్సల్ ప్రశ్నించారు.(Sunil Bansal Warning Telangana BJP Leaders)


ఈ వార్తలూ చదవండి

అభిజీత్ దీప్కే లాంటి వాళ్లు వస్తారు.. సీజేపీ నేతపై పీయూష్ గోయల్ వ్యాఖ్యలు..

గ్రీకు రెస్టారెంట్‌లో తొలి పరిచయం.. రాజీవ్‌ గాంధీతో ప్రేమకథను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ..

Updated Date - Oct 24 , 2026 | 06:44 PM