స్టార్ హాస్పిటల్స్‌లో భారీ డేటా లీక్
ABN , Publish Date - Aug 03 , 2026 | 05:53 AM
రాష్ట్రంలో ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రి అయిన స్టార్ హాస్పిటల్స్‌లో భారీ డేటా లీక్ జరిగింది. తమ ఆస్పత్రిలో చికిత్స పొందిన రోగుల వ్యక్తిగత వివరాలు, వైద్య రికార్డులతోపాటు సంస్థ అంతర్గత...
రోగుల వైద్య రికార్డులు, వ్యక్తిగత సమాచారం
ఓ వెబ్‌సైట్‌లో ప్రత్యక్షం
పోలీసులను ఆశ్రయించిన ఆస్పత్రి యాజమాన్యం
హైదరాబాద్, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రి అయిన స్టార్ హాస్పిటల్స్‌లో భారీ డేటా లీక్ జరిగింది. తమ ఆస్పత్రిలో చికిత్స పొందిన రోగుల వ్యక్తిగత వివరాలు, వైద్య రికార్డులతోపాటు సంస్థ అంతర్గత సమాచారం, ఉద్యోగుల వివరాలు ఓ వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమయ్యాయని స్టార్ హాస్పిటల్స్ సీఈవో రాహుల్ మెడక్కర్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(సీఎ్‌సబీ)లో ఫిర్యాదు చేశారు. వేర్‌హౌ్‌స.డిఐవై అనే వెబ్‌సైట్‌లో స్టార్ హాస్పిటల్స్‌కు సంబంధించిన సున్నితమైన సమాచారం ప్రత్యక్షమైందని, ఆ వెబ్‌సైట్‌లో ప్రవేశించేందుకు కావాల్సిన లాగిన్ వివరాలు వాట్సా్‌పలో చక్కర్లు కొడుతున్నాయని సీఈవో తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ డేటాను అధికారిక భాగస్వాములైన ఐదు కంపెనీలతో మాత్రమే పరిమిత అవసరాల కోసం పంచుకుంటామని, ఇతరులకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని వివరించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆస్పత్రి వ్యవస్థలోకి అక్రమంగా ప్రవేశించి డేటాను సేకరించి వెబ్‌సైట్‌లో ప్రచురించినట్లు భావిస్తున్నామని పేర్కొన్నారు. తక్షణమే ఆ వెబ్‌సైట్‌ను బ్లాక్ చేసి, బాధ్యులను గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. తమ డేటాను ప్రచురించిన వెబ్‌సైట్ నేమ్‌చీప్ అనే డొమైన్ ద్వారా రిజిస్టర్ చేసి ఉందని స్టార్ ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఆ డొమైన్ ఏ దేశం నుంచి ఆపరేట్ అవుతుందనే విషయాన్ని గుర్తించడానికి సీఎ్‌సబీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. కాగా, ఆస్పత్రులు, బీమా సంస్థలు, డయాగ్నొస్టిక్ కేంద్రాల నుంచి సేకరించిన రోగుల సమాచారం బ్లాక్‌మార్కెట్‌లో ఖరీదైన దందాగా మారింది. ఈ సమాచారం ఆధారంగా సైబర్ నేరగాళ్లు అనేక మోసాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో స్టార్ హాస్పిటల్స్ కేసుకు చాలా ప్రాధాన్యముందని సైబర్ సెక్యూరిటీ నిపుణులు అంటున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం.. ఐదుగురి మృతి, 41 మంది గల్లంతు..
వాషింగ్టన్‌లో భారీ కార్చిచ్చు.. 2.5 లక్షల ఎకరాలు దగ్ధం..