కేసీఆర్ లేఖపై స్పందించిన సిట్.. విచారణకు సమయం ఇవ్వాలని నిర్ణయం..
ABN , Publish Date - Jan 29 , 2026 | 09:23 PM
కేసీఆర్ లేఖపై సిట్ అధికారులు సానుకూలంగా స్పందించారు. కేసీఆర్ విచారణకు సమయం ఇవ్వాలని నిర్ణయించారు. తదుపరి విచారణ తేదీపై నిర్ణయం తీసుకోనున్నారు..
హైదరాబాద్, జనవరి 29: ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు సిట్ అధికారులు గురువారం నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం 3:00 గంటలకు విచారణకు అందుబాటులో ఉండాలని నోటీసులో స్పష్టం చేశారు. నోటీసులపై స్పందించిన కేసీఆర్.. ఈ మేరకు సిట్ అధికారులకు లేఖ రాశారు. రేపు ( శుక్రవారం) విచారణకు హాజరు కాలేనని తెలిపారు.
మున్సిపల్ ఎన్నికల కారణంగా విచారణను వాయిదా వేయాలని కోరారు. మరో రోజు విచారణకు పిలిస్తే తప్పకుండా హాజరవుతానని, విచారణ కోసం వేరే తేదీ నిర్ణయించాలని సిట్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఇక, కేసీఆర్ లేఖపై సిట్ అధికారులు సానుకూలంగా స్పందించారు. కేసీఆర్ విచారణకు సమయం ఇవ్వాలని నిర్ణయించారు. తదుపరి విచారణ తేదీపై నిర్ణయం తీసుకోనున్నారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ విచారణపై న్యాయ సలహా తీసుకుని.. మరో నోటీస్ ఇవ్వనున్నారు.
ఇవి కూడా చదవండి..
సిట్ అధికారులకు లేఖ రాసిన కేసీఆర్.. విచారణ వాయిదా వేయాలని విజ్ఞప్తి..
కిందపడినా.. వీడియో ఆగకూడదు.. ఈ ఫొటొగ్రాఫర్ పనితనం చూస్తే..