Share News

సింగరేణి బొగ్గు రవాణాపై యాజమాన్యం క్లారిటీ

ABN , Publish Date - Jun 21 , 2026 | 08:48 PM

సింగరేణి బొగ్గు రవాణాపై యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది. సింగరేణిలో బొగ్గు చోరీ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని తేల్చి చెప్పింది. ప్రతి టన్ను బొగ్గుపై డిజిటల్ పర్యవేక్షణ కొనసాగుతోందని తెలిపింది.

సింగరేణి బొగ్గు రవాణాపై యాజమాన్యం క్లారిటీ
Singareni coal transport

హైదరాబాద్, జూన్ 21: సింగరేణి బొగ్గు రవాణాపై యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది. సింగరేణిలో బొగ్గు చోరీ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని తేల్చి చెప్పింది. ప్రతి టన్ను బొగ్గుపై డిజిటల్ పర్యవేక్షణ కొనసాగుతోందని తెలిపింది. బొగ్గు ఉత్పత్తి నుంచి వినియోగదారుడి వరకు పూర్తి ట్రాకింగ్ ఉంటుందని వెల్లడించింది. ఎస్‌ఏపీ, కోల్ నెట్ ద్వారా బొగ్గు కేటాయింపులు, రవాణా మానిటరింగ్ జరుగుతుందని పేర్కొంది. 85 శాతం బొగ్గు.. రైల్వే ద్వారా.. 15 శాతం రోడ్డు మార్గంలో రవాణా అవుతుందని తెలిపింది. RFID, GPS, జియోఫెన్సింగ్‌తో వాహనాలపై రియల్‌టైమ్ నిఘా ఉంటుందని వెల్లడించింది.


ఎలక్ట్రానిక్ వేబ్రిడ్జ్‌ల వద్ద ప్రతి వాహనానికి తూకం నమోదు చేయటం జరుగుతుందని పేర్కొంది. రైల్వే వ్యాగన్ల లోడింగ్, డిస్పాచ్ వివరాలు డిజిటల్‌గా రికార్డు చేయటం జరుగుతుందని వెల్లడించింది. గనులు, సీహెచ్‌పీలు, స్టాక్‌యార్డుల్లో 24 గంటల సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణ, ఫ్లయింగ్ స్క్వాడ్లు, చెక్‌పోస్టులు, భద్రతా సిబ్బందితో కట్టుదిట్టమైన నిఘా ఉంటుందని తెలిపింది. హోలోగ్రామ్ చలానాలు, టాస్క్‌ఫోర్స్‌తో బహుళస్థాయి భద్రతా వ్యవస్థ ఉంటుందని వెల్లడించింది. బొగ్గు మాయం, చోరీ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని తేల్చి చెప్పింది.


ఇవి కూడా చదవండి

చర్చలు విఫలమైతే మళ్లీ దాడులు చేస్తాం.. ఇరాన్‌కు ట్రంప్‌ హెచ్చరిక

మార్పు దిశగా 'మహా' రాజకీయాలు.. బీజేపీ, శివసేనలపై ప్రభావమెంత?

Updated Date - Jun 21 , 2026 | 09:01 PM