Share News

ఫ్యూచర్‌సిటీలో పెట్టుబడులను ప్రోత్సహించండి

ABN , Publish Date - Sep 17 , 2026 | 04:02 AM

): భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేస్తున్న ‘భారత్‌ ఫ్యూచర్‌సిటీ’లో పెట్టుబడులకు సింగపూర్‌ కంపెనీలను ప్రోత్సహించాలని ఆ దేశ ప్రతినిధుల బృందాన్ని మంత్రి శ్రీధర్‌బాబు కోరారు.

ఫ్యూచర్‌సిటీలో పెట్టుబడులను ప్రోత్సహించండి
SRIDHARBABU

  • సింగపూర్‌ ప్రతినిధుల

బృందంతో మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేస్తున్న ‘భారత్‌ ఫ్యూచర్‌సిటీ’లో పెట్టుబడులకు సింగపూర్‌ కంపెనీలను ప్రోత్సహించాలని ఆ దేశ ప్రతినిధుల బృందాన్ని మంత్రి శ్రీధర్‌బాబు కోరారు. సెమీకండక్టర్‌ రంగంలో సింగపూర్‌కు ఉన్న సాంకేతిక, పారిశ్రామిక అనుభవాన్ని తెలంగాణతో అనుసంధానించాలన్నారు. రాష్ట్రంలో ఫ్యాబ్‌ పరిశ్రమలతో పాటు అనుబంధ పరిశ్రమలు, వాటి సరఫరా వ్యవస్థను మరింత అభివృద్ధి చేసేందుకు సింగపూర్‌ కంపెనీల భాగస్వామ్యాన్ని పెంచేలా చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. సింగపూర్‌ వాణిజ్య, పరిశ్రమల శాఖకు చెందిన ఎనర్జీ అండ్‌ ట్రేడ్‌ శాశ్వత కార్యదర్శి ఆగస్టిన్‌ లీ నేతృత్వంలోని ఆ దేశ ఉన్నతస్థాయి ప్రతినిధుల బృందం బుధవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి శ్రీధర్‌బాబుతో సమావేశమైంది. ఈ సందర్భంగా అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా తెలంగాణను ‘గ్లోబల్‌ ఇన్వె్‌స్టమెంట్‌ హబ్‌’గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మంత్రి శ్రీధర్‌బాబు వివరించారు. అధిక విలువ కలిగిన, ఆర్‌ అండ్‌ డీ, సాంకేతిక ఆధారిత పరిశ్రమలకు అవసరమైన పరిస్థితులను రాష్ట్రంలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామన్నారు. ఐటీ, సెమీకండక్టర్లు, ఎలకా్ట్రనిక్స్‌, లైఫ్‌సైన్సెస్‌, బయో టెక్నాలజీ, ఏరోస్పేస్‌, రెన్యూవబుల్‌ ఎనర్జీ, స్కిల్‌ డెవల్‌పమెంట్‌, ఇన్నోవేషన్‌ తదితర రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణలో విస్తృత అవకాశాలున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్‌ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌- 2026’లో సింగపూర్‌ ప్రభుత్వం, ఆ దేశ ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొనేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - Sep 17 , 2026 | 04:06 AM