Share News

కంటోన్మెంట్ ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం..

ABN , Publish Date - Feb 10 , 2026 | 05:02 AM

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే గణేష్‌కు ప్రమాదం తప్పింది. మంచిర్యాలలో మునిసిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిర్వహించిన..

కంటోన్మెంట్ ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం..

మంచిర్యాలక్రైం, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే గణేష్‌కు ప్రమాదం తప్పింది. మంచిర్యాలలో మునిసిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిర్వహించిన సభలో ఎమ్మెల్యే గణేష్‌ పాల్గొన్నారు. ప్రచారం అనంతరం తిరిగి వెళ్తుండగా మంచిర్యాల బస్టాండ్‌ సమీపంలో ఎమ్మెల్యే కాన్వాయ్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. బస్సు డ్రైౖవర్‌ జక్కుల మల్లేశ్‌ మద్యం తాగినట్లు తేలడంతో అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు మంచిర్యాల సీఐ ప్రమోద్‌రావు తెలిపారు.

Updated Date - Feb 10 , 2026 | 09:13 AM