తెలంగాణ కొత్త సీఎస్‌గా సంజయ్ జాజు.. లైన్ క్లియర్ అయినట్లేనా?
ABN , Publish Date - Jun 23 , 2026 | 09:46 PM
తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు బాధ్యతలు చేపట్టేందుకు లైన్ క్లియర్ అయినట్లు వార్తలు వస్తున్నాయి..
హైదరాబాద్, జూన్ 23: తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు బాధ్యతలు చేపట్టేందుకు లైన్ క్లియర్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర సీఎస్‌గా సేవలందిస్తున్న కె. రామకృష్ణా రావు పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త సీఎస్ ఎంపికపై గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తిని మన్నించిన కేంద్ర ప్రభుత్వం, కేంద్ర సర్వీసుల్లో ఉన్న సంజయ్ జాజును తిరిగి మాతృ రాష్ట్ర కేడర్‌కు (తెలంగాణకు) పంపుతూ కీలక నిర్ణయం తీసుకుంది.
రాష్ట్ర పరిపాలనపై సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన్ను.. సీఎస్ స్థానంలో నియమించేందుకే రేవంత్ రెడ్డి సర్కార్ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే నిన్న ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సంజయ్ జాజు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో తాజా పరిణామాలు, పరిపాలనాపరమైన అంశాలపై వీరిద్దరి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.