Share News

తెలంగాణకు సఫ్రాన్ భారీ పెట్టుబడి.. రూ.4,000 కోట్లతో విస్తరణకు ప్లాన్

ABN , Publish Date - Nov 21 , 2026 | 07:19 PM

తెలంగాణ పారిశ్రామిక రంగానికి మరో భారీ పెట్టుబడి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ ఏరోస్పేస్ సంస్థ సఫ్రాన్ రాష్ట్రంలో సుమారు రూ.4,000 కోట్ల పెట్టుబడికి ఆసక్తి చూపుతోంది.

తెలంగాణకు సఫ్రాన్ భారీ పెట్టుబడి.. రూ.4,000 కోట్లతో విస్తరణకు ప్లాన్
Telangana Investments

హైదరాబాద్, నవంబరు 21: ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ ఏరోస్పేస్ సంస్థ సఫ్రాన్ తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతోంది. రాష్ట్రంలో సుమారు రూ.4,000 కోట్ల పెట్టుబడితో తయారీ కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రతిపాదించినట్లు సమాచారం. ఫ్రాన్స్‌లోని సఫ్రాన్ తయారీ కేంద్రాన్ని సందర్శించిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సంస్థ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలు, కొత్త తయారీ యూనిట్ల ఏర్పాటు, భవిష్యత్ విస్తరణ ప్రణాళికలపై చర్చించారు. ఇప్పటికే హైదరాబాద్‌లో పలు తయారీ యూనిట్లను నిర్వహిస్తున్న సఫ్రాన్.. లీప్ విమాన ఇంజిన్ల విడిభాగాల తయారీలో కీలక కార్యకలాపాలు కొనసాగిస్తోంది. అంతేకాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద లీప్ ఎంఆర్‌ఓ కేంద్రాల్లో ఒకదాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో మరిన్ని తయారీ కార్యకలాపాలను చేపట్టేందుకు సంస్థ ఆసక్తి కనబరచడం రాష్ట్ర పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత సంతరించుకుంది.


డిసెంబర్ గ్లోబల్ సమ్మిట్‌లో ఎంఓయూపై ఆశలు..

తెలంగాణలో పెట్టుబడి ప్రతిపాదనకు సంబంధించి డిసెంబర్‌లో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో సఫ్రాన్‌తో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ సదస్సుకు హాజరుకావాలని సఫ్రాన్ ప్రతినిధి బృందాన్ని భట్టి విక్రమార్క ఆహ్వానించారు. ప్రతిపాదిత రూ.4,000 కోట్ల పెట్టుబడి కార్యరూపం దాలిస్తే తెలంగాణ ఏరోస్పేస్, రక్షణ రంగాల తయారీ సామర్థ్యానికి మరింత బలం చేకూరనుంది.


ఈ వార్తలు కూడా చదవండి

రాహుల్‌ గాంధీకి కిరణ్ రిజిజు కౌంటర్.. కాంగ్రెస్‌కు నాలుగు సూటి ప్రశ్నలు..

ఆసక్తికరంగా కొలత్తూరు ఉపఎన్నిక.. ఎంకే స్టాలిన్ మళ్లీ పోటీ చేస్తారా..?

Updated Date - Nov 21 , 2026 | 07:23 PM