ఓటీపీ రాకుండానే నగదు మాయం!
ABN , Publish Date - Nov 10 , 2026 | 02:05 AM
ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బ్యాంకు ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు ఓపీటీలు రాకుండానే ఏకంగా రూ.48.09 లక్షలు కొట్టేశారు
బ్యాంకు ఖాతా నుంచి 9 లావాదేవీలు
మొత్తం రూ.48.09 లక్షలు బదిలీ
సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి
హైదరాబాద్ సిటీ, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బ్యాంకు ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు ఓపీటీలు రాకుండానే ఏకంగా రూ.48.09 లక్షలు కొట్టేశారు. హైదరాబాద్ మియాపూర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సోలమన్ కిరణ్ కుమార్ రాయ, తన తల్లి రాయ మేరీ ఎలిజబెత్ రాణితో కలిసి ఏపీలోని రాజమహేంద్రవరంలోని ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో ఉమ్మడి ఖాతా తీసుకున్నాడు. అయితే, ఈ ఖాతా నుంచి ఈ నెల 9న మొత్తం వరసగా 9 లావాదేవీల ద్వారా రూ. 48,09,300 డెబిట్ అయ్యాయి. ఈ మేరకు మెసేజ్‌లు రావడంతో బాధితుడు బ్యాంకుకు వెళ్లి విచారించగా ఓటీపీలు రాకుండానే లావాదేవీల ద్వారా నగదు బది లీ జరిగినట్లు గుర్తించాడు. దీంతో వెంటనే సంబంధిత బ్యాంకును సంప్రదించి, ఫిర్యాదు చేశాడు. ఈ నగదు వివిధ పేర్లతో ఉన్న ఖాతాలకు బదిలీ అయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. అదేవిధంగా 1930 హెల్ప్‌లైన్ ద్వారా సైబర్ క్రైం పోర్టల్‌లోనూ ఫిర్యాదు చేశాడు. సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.