ఉప్పర్‌పల్లి బార్బీక్యూ నేషన్‌లో కుళ్లిన మాంసం!
ABN , Publish Date - Jul 03 , 2026 | 06:59 AM
ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న అత్తాపూర్ ఉప్పర్‌పల్లిలోని బార్బీక్యూ నేషన్ రెస్టారెంట్‌లో హైదరాబాద్ ఫుడ్ అడలే్ట్రషన్ సర్వైలెన్స్ (హెచ్-ఫా్‌స్ట), ఫుడ్ సేఫ్టీ అధికారులు..
హెచ్-ఫాస్ట్, ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
రాజేంద్రనగర్, జూలై 2 (ఆంధ్రజ్యోతి): ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న అత్తాపూర్ ఉప్పర్‌పల్లిలోని బార్బీక్యూ నేషన్ రెస్టారెంట్‌లో హైదరాబాద్ ఫుడ్ అడలే్ట్రషన్ సర్వైలెన్స్ (హెచ్-ఫా్‌స్ట), ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కుళ్లిన మాంసం, ఆపరిశుభ్ర వాతావరణంలో నిల్వ చేసిన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని.. వాటి శాంపిళ్లను ల్యాబ్‌కు పంపారు. ఇటీవల ఈ రెస్టారెంట్‌లో తిన్న ఇద్దరికి ఫుడ్ పాయిజనింగ్ కావడంతో వారు హెచ్-ఫా్‌స్టకు ఫిర్యాదు చేశారు. గురువారం అత్తాపూర్ సర్కిల్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ సౌమ్యరెడ్డి, హెచ్-ఫాస్ట్ పోలీసులు బార్బీక్యూ నేషన్‌లో తనిఖీలు చేపట్టారు. ఐదారు రోజుల క్రితం తెచ్చిన మాంసానికి గురువారం డేట్ వేసిన లేబుళ్లు అతికించినట్టు గుర్తించారు. సరైన పద్ధతిలో నిల్వ కూడా చేయలేదని నిర్ధారించారు. అపరిశుభ్ర వాతావరణంలో నిల్వ చేసిన చికెన్, మటన్, చేపలు, కేకులు, ఐస్‌క్రీం ఇతర ఆహార పదార్థాల శాంపిళ్లను సేకరించి ల్యాబ్‌కు పంపుతున్నట్లు ఫుడ్ ఇన్‌స్పెక్టర్ సౌమ్యారెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి.. సదరు రెస్టారెంట్‌పై భారీ జరిమానా విధించడంతో పాటు చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, రాజేంద్రనగర్, అత్తాపూర్ సర్కిళ్లలోని చాలా హోటళ్లు, రెస్టారెంట్లు నాణ్యతా ప్రమాణాలు పాటించట్లేదని.. వాటన్నింటిలోనూ తనిఖీలు నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి
టీ తాగడం మంచిదే.. కానీ ఈ 6 పొరపాట్లు చేస్తే సమస్యలు తప్పవు
కోళ్లు అరుస్తున్నాయని వెళ్లి చూస్తే.. మృత్యువు వెంటాడింది