Share News

హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ నూతన కార్యవర్గం

ABN , Publish Date - Oct 16 , 2026 | 05:23 AM

హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ సొసైటీ కొత్త కార్యవర్గం ఎన్నికైనట్లు మాజీ అధ్యక్షుడు కవి యాకూబ్‌ తెలిపారు.

హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ నూతన కార్యవర్గం
book fair

  • అధ్యక్షుడిగా రాంపల్లి రమేష్‌, కార్యదర్శిగా నారాయణరెడ్డి

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ సొసైటీ కొత్త కార్యవర్గం ఎన్నికైనట్లు మాజీ అధ్యక్షుడు కవి యాకూబ్‌ తెలిపారు. నవతెలంగాణ పబ్లిషింగ్‌ హౌస్‌ ప్రతినిధి రాంపల్లి రమేష్‌ అధ్యక్షుడిగా, నవచేతన పబ్లిషింగ్‌ హౌస్‌ ప్రతినిధి పి. నారాయణ రెడ్డి కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించినట్లు చెప్పారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో ఆయన ఈ కొత్త కార్యవర్గాన్ని ప్రకటించారు. ఉపాధ్య్షక్షులుగా తెలుగు బుక్స్‌ శోభన్‌బాబు, మలుపు బాల్‌ రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా జై భారత్‌ పబ్లికేషన్స్‌ రజని, కోశాధికారిగా మంచి పుస్తకం సురేష్‌ ఎన్నికయ్యారు. సొసైటీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కొత్త కార్యవర్గంలో గీతా రామస్వామి, సజయ, రజని అనే ముగ్గురు మహిళా ప్రచురణకర్తలు భాగస్వామ్యం వహించడం విశేషమని మలుపు బాల్‌రెడ్డి పేర్కొన్నారు. 39వ పుస్తక ప్రదర్శన ఈ ఏడాది డిసెంబర్‌ 18 నుంచి 28 వరకు ఎన్టీఆర్‌ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ వార్తలు కూడా చదవండి

ఎల్‌నినో ప్రభావం.. నీటిని పొదుపుగా వినియోగించండి: సీఎస్‌

విదేశీ బొగ్గు దిగుమతితో సింగరేణికి మరణశాసనం రాస్తున్న సీఎం రేవంత్: కేటీఆర్

Updated Date - Oct 16 , 2026 | 05:24 AM