విక్టిమ్ సిటిజన్ సెంట్రిక్ విధానం.. బాధితులను స్టేషన్‌కు పిలిస్తే అధికారులదే బాధ్యత
ABN , Publish Date - Jan 21 , 2026 | 08:54 PM
విక్టిమ్ సిటిజన్ సెంట్రిక్ విధానంలో భాగంగా ఇకపై శారీరక, లైంగిక దాడులకు గురైన మహిళలు, పిల్లలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా వారు కోరుకున్నచోటుకే పోలీసులు వెళ్లి ఫిర్యాదు స్వీకరించి, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయనున్నారు.
తెలంగాణ పోలీస్ శాఖ విక్టిమ్ సిటిజన్ సెంట్రిక్ విధానాన్ని అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. విక్టిమ్ సిటిజన్ సెంట్రిక్ విధానంలో భాగంగా ఇకపై శారీరక, లైంగిక దాడులకు గురైన మహిళలు, పిల్లలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా వారు కోరుకున్నచోటుకే పోలీసులు వెళ్లి ఫిర్యాదు స్వీకరించి, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయనున్నారు. బాధితులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా ఈ నూతన విధానం అమలవుతోంది. తెలంగాణ సీఐడీ ఈ విధానాన్ని రూపొందించింది.
బాధితులను స్టేషన్‌కు పిలిస్తే అధికారులదే బాధ్యత
విక్టిమ్ సిటిజన్ సెంట్రిక్ విధానంపై సీపీ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ.. ‘మానసికంగా కుంగిపోయిన బాధితులు స్టేషన్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా హైదరాబాద్ పోలీసులు చర్యలు తీసుకుంటారు. బాధితుల గౌరవం, గోప్యతకు భంగం కలగకుండా సేవలు అమలులో ఉంటాయి. విధానం అమలులో అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవు. బాధితులను అకారణంగా స్టేషన్‌కు పిలిస్తే సంబంధిత అధికారులదే బాధ్యత. ప్రతి కేసును డీసీపీ, ఏసీపీ స్థాయి అధికారులు పర్యవేక్షిస్తారు. ఫిర్యాదు లేదా ఎఫ్ఐఆర్ నమోదు జరగకపోతే హైదరాబాద్ పోలీస్ వాట్సాప్ నెంబర్ 94906 16555 కు సమాచారం ఇవ్వండి. సైబర్ నేరాలకు ఇప్పటికే ప్రారంభమైన ‘సి-మిత్ర’తో పాటు ఈ విధానం ప్రజలకు మరింత మేలు చేస్తుంది’ అని సీపీ సజ్జనార్ అశాభావం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి:
దళిత, గిరిజన పారిశ్రామికవేత్తలకు బిగ్ రిలీఫ
దావోస్‌లో సీఎం రేవంత్‌రెడ్డి.. టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్‌తో భేటీ