శాంతియుత వాతావరణంలోనే సమస్యకు పరిష్కారం: సీఎం రేవంత్
ABN , Publish Date - Mar 07 , 2026 | 04:45 PM
శాంతియుత వాతావరణంలోనే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. లొంగిపోయిన మావోయిస్టుల ఆర్థిక, ఆరోగ్య భద్రతకు భరోసా కల్పిస్తామని చెప్పారు. ఇంకా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు కూడా లొంగిపోవాలని స్పష్టం చేశారు.
హైదరాబాద్, మార్చి 7: 130 మంది మావోయిస్టులు శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. దేవ్‌జీకి చెందిన పీఎల్‌జీఏ కమిటీ మొత్తం సరెండర్ అయిపోయింది. మావోయిస్టులు తమ ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. మొత్తం 124 ఆయుధాలను సరెండర్ చేశారు. లొంగిపోయిన వారిలో దేవ్‌జీ, బడే చొక్కారావు గన్‌మెన్లు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..
‘శాంతియుత వాతావరణంలోనే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. లొంగిపోయిన మావోయిస్టుల ఆర్థిక, ఆరోగ్య భద్రతకు భరోసా కల్పిస్తాం. ఇంకా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు లొంగిపోవాలి. లొంగిపోయిన మావోయిస్టులకు అవసరమైన వసతులు కల్పిస్తాం. మావోయిస్టుల లొంగుబాటుకు అధికారులు తీవ్ర కృషిచేశారు. పోలీసులు మావోయిస్టుల్లో నమ్మకం కల్పించారు. దేవ్‌జీ, ఆయన మిత్రబృందం కొన్ని ప్రతిపాదనలు చేశారు. తమ సమస్యలు పరిష్కరిస్తే లొంగిపోతామని చెప్పారు’.
రాష్ట్ర స్థాయిలో మేం చేయగలిగిందంతా చేస్తాం. మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగిపోవాలి. అజ్ఞాతంలో ఉన్న తెలంగాణకు చెందిన ఏడుగురు కూడా.. త్వరగా లొంగిపోవాలి. లొంగిపోయిన వారికి పునరావాసం కల్పించాలని అమిత్ షా చెప్పారు. లొంగిపోయిన మావోయిస్టులకు రివార్డు కూడా అందజేస్తాం. ప్రత్యేకమైన ఆరోగ్య భద్రత కార్డులు ఇస్తాం’ అని రేవంత్ రెడ్డి హామీ చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి
హైదరాబాద్‌లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ గుట్టురట్టు.. టాస్క్ ఫోర్స్ మెరుపు దాడులు
నేటితో ముగిసిన ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ