Share News

Pawan Kalyan: కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం

ABN , Publish Date - Jan 03 , 2026 | 01:17 PM

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జనసేన అధినేత మాట్లాడుతూ గతంలో జరిగిన విద్యుత్ ప్రమాదం నుంచి తనను ఆ అంజన్నే కాపాడారని కామెంట్ చేశారు.

Pawan Kalyan: కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం
Pawan Kalyan Visits Kondagattu Temple

ఇంటర్నెట్ డెస్క్: గతంలో జరిగిన విద్యుత్ ప్రమాదం నుంచి తనను కొండగట్టు అంజన్నే కాపాడారని ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామిని నేడు ఏపీ డిప్యూటీ సీఎం దర్శించుకున్నారు. తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.. ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వాయుపుత్ర సదన్ ధర్మశాల, దీక్ష విరమణ మండపానికి భూమి పూజ చేశారు. రూ.35.19 కోట్ల టీటీడీ నిధులతో 100 గదులు ఉండేలా ధర్మశాలను నిర్మించేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే (AP Dy CM Pawan Kalyan Kondagattu Temple Visit).


ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం మీడియాతో మాట్లాడారు. ‘అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నామంటే దేవుడి దయ ఉండాలి. కొండగట్టు నాకు పునర్జన్మను ఇచ్చింది. గతంలో జరిగిన విద్యుత్ ప్రమాదం నుంచి నేను ఎలా బయటపడ్డానో తలుచుకుంటే ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుంది. కొండగట్టు అంజన్నే నన్ను కాపాడారు’ అని అన్నారు. టీటీడీ, తెలంగాణ నేతల సమిష్టి కృషితోనే ధర్మశాల నిర్మాణం విషయంలో ముందడుగు పడిందని అన్నారు. భక్తుల బలమైన సంకల్పంతో ఇది సాధ్యమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, తదితరులు పాల్గొన్నారు. ఈ పర్యటన సందర్భంగా ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బృందావనం రిసార్ట్‌లో సర్పంచ్‌లు, జనసేన కార్యకర్తలతో కూడా సమావేశమయ్యారు.

Kondagattu TempleDeeksha Viramana Mandapam


ఇవీ చదవండి

ఇదెక్కడి సభ.. ఇదెక్కడి సంప్రదాయం: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఫైర్

నీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో గళమెత్తిన బీజేపీ ఎమ్మెల్యేలు

Updated Date - Jan 03 , 2026 | 02:52 PM