Share News

చేయూత’కు 3.70 లక్షలకుపైగా దరఖాస్తులు

ABN , Publish Date - Aug 29 , 2026 | 03:41 AM

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘చేయూత’ పథకం ద్వారా కొత్త పింఛన్ల మంజూరు కోసం రాష్ట్రవ్యాప్తంగా 3.70 లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు.

చేయూత’కు  3.70 లక్షలకుపైగా దరఖాస్తులు

  • మరో మూడు రోజులే గడువు

  • వితంతు పింఛన్లకే ఎక్కువ అర్జీలు

హైదరాబాద్‌, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘చేయూత’ పథకం ద్వారా కొత్త పింఛన్ల మంజూరు కోసం రాష్ట్రవ్యాప్తంగా 3.70 లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. ఇక మూడు రోజులే గడువు ఉండటంతో చివరి రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. చేయూత కొత్త దరఖాస్తుల డేటా ఎంట్రీ నివేదిక ప్రకారం... ఈనెల 28 నాటికి మొత్తం 3,70,173 దరఖాస్తులు అందాయి. వీటిలో వితంతు పింఛన్‌ కోసం అత్యధికంగా 2,34,693, దివ్యాంగుల విభాగంలో 93,151, ఒంటరి మహిళలవి 14,216, చేనేత కార్మికులవి 7,872, టాడీ ట్యాపర్లవి 20,241 దరఖాస్తులు ఉన్నాయి. జిల్లాల వారీగా పరిశీలిస్తే హైదరాబాద్‌లో అత్యధికంగా 22,268, నల్గొండలో 21,755, మేడ్చల్‌-మల్కాజిగిరిలో 19,873, కామారెడ్డిలో 19,552, రంగారెడ్డిలో 19,437 చొప్పున దరఖాస్తులు వచ్చాయి. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లోనూ అధిక సంఖ్యలో అర్జీలు పెట్టుకున్నారు. ప్రస్తుతం దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 31 తుది గడువు. ఇది ముగిసేసరికి మొత్తం దరఖాస్తుల సంఖ్య 4.50 లక్షలు దాటిపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

కాలుష్యంపై కృష్ణంపాలెం గ్రామస్థుల విజ్ఞప్తి.. డిప్యూటీ సీఎం తక్షణ స్పందన

ఒంగోలులో లోకేశ్ పర్యటన.. రాడిసన్ 5 స్టార్‌ హోటల్‌కు శంకుస్థాప

Updated Date - Aug 29 , 2026 | 04:03 AM