సౌదీలో నిర్మల్ జిల్లావాసి ఐదేళ్లుగా అదృశ్యం
ABN , Publish Date - Oct 16 , 2026 | 05:31 AM
ఉపాధి కోసం సౌదీ అరేబియాకు వెళ్లిన నిర్మల్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఆచూకీ ఐదేళ్లుగా కనిపించడం లేదు.
విదేశాంగ శాఖకు వివరాలు పంపిన కేంద్రమంత్రి కిషన్రెడ్డి
ఖానాపూర్, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): ఉపాధి కోసం సౌదీ అరేబియాకు వెళ్లిన నిర్మల్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఆచూకీ ఐదేళ్లుగా కనిపించడం లేదు. విషయం తెలుసుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేశ్రాథోడ్ బాధిత కుటుంబ సభ్యులను గురువారం హైదరాబాద్లో ఉన్న కేంద్రమంత్రి కిషన్రెడ్డి వద్దకు తీసుకెళ్లి వారి ఆవేదనను వివరించారు. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి.. సంబంధిత వివరాలను కేంద్ర విదేశాంగ శాఖకు పంపించారు. ఖానాపూర్ మండలంలోని గోడలపంపు గ్రామానికి చెందిన సింగం రాజేశ్వర్గౌడ్ 2019లో సౌదీ వెళ్లాడు. 2021 నుంచి అందుబాటులో లేకుండా పోయాడు. కాగా, బాధిత కుటుంబానికి అండగా నిలిచి, రాజేశ్వర్గౌడ్ను స్వదేశానికి తీసుకురావడానికి చర్యలు చేపడతామని కిషన్రెడ్డి హామీ ఇచ్చినట్లు రితేశ్రాథోడ్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఎల్నినో ప్రభావం.. నీటిని పొదుపుగా వినియోగించండి: సీఎస్
విదేశీ బొగ్గు దిగుమతితో సింగరేణికి మరణశాసనం రాస్తున్న సీఎం రేవంత్: కేటీఆర్