Share News

ఆద్యకళ అమ్మ ఇకలేరు

ABN , Publish Date - Nov 10 , 2026 | 05:32 AM

ప్రముఖ పరిశోధకుడు ఆచార్య జయధీర్‌ తిరుమలరావు సతీమణి నీల(70) ఇకలేరు. గుండె, శ్వాస కోశ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆమె నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి 10..30 గంటలకు తుదిశ్వాస విడిచారు.

ఆద్యకళ అమ్మ ఇకలేరు
aadhyakala

  • జయధీర్‌ తిరుమలరావు

  • సతీమణి నీల కన్నుమూత

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పరిశోధకుడు ఆచార్య జయధీర్‌ తిరుమలరావు సతీమణి నీల(70) ఇకలేరు. గుండె, శ్వాస కోశ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆమె నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి 10..30 గంటలకు తుదిశ్వాస విడిచారు. జయధీర్‌ తిరుమల రావు సేకరించిన ఆద్యకళలోని చారిత్రక వస్తువులను భద్రపరచడం, వాటి సంరక్షణ బాధ్యతలను నిర్వర్తించడంలో నీల ప్రముఖ పాత్ర పోషించారు. తిరుమల రావు కృషిని గుర్తించిన వారంతా నీలను ఆద్యకళకు అమ్మగా అభివర్ణిస్తుంటారు. తాళపత్ర గ్రంథాలు, కాగితపు చుట్టలు, ఆదివాసీ, గిరిజన సంస్కృతికి అద్దం పట్టే సంగీత వాద్యాలు, మట్టి పాత్రలు, లోహపు వస్తువులు, కుల పురాణాలు కళ్లకు కట్టే పటాలు లాంటి అరుదైన అపూర్వమైన వస్తు సంచయాన్ని సంరక్షిస్తూ, తద్వారా ప్రజా సాంస్కృతిక రంగానికి నీల అవిరళ కృషి చేశారంటూ పలువురు కవులు, రచయితలు, పరిశోధకులు ఆమె సేవలను గుర్తు చేసుకున్నారు. జయధీర్‌ తిరుమలరావుకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Updated Date - Nov 10 , 2026 | 05:32 AM