Share News

హైవేపై అదుపుతప్పి కారు బోల్తా.. ఇద్దరి మృతి..

ABN , Publish Date - Jun 02 , 2026 | 07:49 AM

జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

హైవేపై అదుపుతప్పి కారు బోల్తా.. ఇద్దరి మృతి..
Nagarkurnool accident

నాగర్‌ కర్నూల్, జూన్ 2: జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. వంగూరు గ్రామానికి చెందిన బాలు, ప్రవీణ్ మరో వ్యక్తి కారులో జడ్చర్ల-కోదాడ జాతీయ రహదారిపై వెళుతున్నారు. కల్వకుర్తి మండలం తాండ్ర గేటు సమీపంలో కారు ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో బాలు, ప్రవీణ్ ప్రాణాలు కోల్పోయారు.


మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వ్యక్తిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు బాలు, ప్రవీణ్ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి

శాసనసభ, శాసనమండలిలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలు..

Updated Date - Jun 02 , 2026 | 07:52 AM