Share News

తెలంగాణ శాసనసభలో విషాదం

ABN , Publish Date - Sep 08 , 2026 | 03:41 PM

తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో ఇవాళ ఓ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ పర్సనల్ సెక్రటరీ రాజు అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు.

తెలంగాణ శాసనసభలో విషాదం
Minister Performs CPR as IAS Officer’s PS Dies of Cardiac Arrest in Telangana Assembly

హైదరాబాద్, సెప్టెంబర్ 8: తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో ఇవాళ చోటుచేసుకున్న ఓ అత్యంత విషాదకర ఘటన అసెంబ్లీ వర్గాలను, అధికారులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ దగ్గర పర్సనల్ సెక్రటరీ (PS)గా విధులు నిర్వహిస్తున్న రాజు శాసనసభ ఆవరణలోనే అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు.


అసెంబ్లీ ప్రాంగణంలో రాజు ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోవడాన్ని గమనించిన మంత్రి వాకిటి శ్రీహరి వెంటనే స్పందించారు. అప్పటికప్పుడు రాజుకు కార్డియోపల్మనరీ రిససిటేషన్ (CPR) చేస్తూ ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ రాజు ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో, వెంటనే అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. అయితే, మార్గమధ్యలోనే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. రాజు అకస్మాత్తుగా గుండెపోటు (Cardiac Arrest)కు గురికావడమే ఈ మృతికి కారణమని తెలుస్తోంది. ఈ హఠాత్పరిణామం అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న వారందరినీ ఆందోళనకు గురిచేసింది.


ఈ వార్తలు కూడా చదవండి

కేసీఆర్ చావును కోరుకుంటున్న సీఎం రేవంత్: వేముల ప్రశాంత్ రెడ్డి

బీఆర్‌ఎస్ దాడిలో గాయపడ్డ మహిళా పోలీసులకు మంత్రి సీతక్క పరామర్శ

Updated Date - Sep 08 , 2026 | 04:17 PM