అసెంబ్లీ ప్రాంగణంలో ఐఏఎస్ పీఏ ఆకస్మిక మరణం
ABN , Publish Date - Sep 09 , 2026 | 02:42 AM
అసెంబ్లీ ప్రాంగణంలో ఇంధన శాఖ స్పెషల్ సీఎస్ నవీన్ మిత్తల్ వ్యక్తిగత కార్యదర్శి (పీఏ) రాజు (51) మంగళవారం ఆకస్మికంగా మరణించారు. శాసనసభ సమావేశాలు ప్రారంభమైన అనంతరం అక్కడ విధి నిర్వహణలో ఉన్న రాజు.. ఒక్కసారిగా అస్వస్థతకు గురై కుప్పకూలారు.
సీపీఆర్ చేసిన మంత్రి వాకిటి శ్రీహరి
ఆస్పత్రికి తరలించినా దక్కని ప్రాణం
హైదరాబాద్/ మెదక్, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ప్రాంగణంలో ఇంధన శాఖ స్పెషల్ సీఎస్ నవీన్ మిత్తల్ వ్యక్తిగత కార్యదర్శి (పీఏ) రాజు (51) మంగళవారం ఆకస్మికంగా మరణించారు. శాసనసభ సమావేశాలు ప్రారంభమైన అనంతరం అక్కడ విధి నిర్వహణలో ఉన్న రాజు.. ఒక్కసారిగా అస్వస్థతకు గురై కుప్పకూలారు. అంతకుముందే కొంత ఇబ్బందిగా ఉందంటూ తోటి ఉద్యోగులకు తెలిపినట్లు సమాచారం. గమనించిన వెంటనే ప్రాంగణంలోని వైద్యులతో పాటు మంత్రి వాకిటి శ్రీహరి రాజుకు సీపీఆర్ చేసి ప్రాథమిక చిక్సిత అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. రాజు రామచంద్రాపురం సమీపంలోని బీహెచ్‌ఈఎల్‌లో నివాసముంటూ రోజూ విధులకు వచ్చేవారని, గతంలోనూ పలువురు ప్రిన్సిపల్ సెక్రటరీల వద్ద పీఏగా పనిచేశారని సహచరులు తెలిపారు.