Share News

జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడడం చాలా బాధాకరం: ఎంపీ మల్లు రవి

ABN , Publish Date - Mar 25 , 2026 | 09:48 PM

జీవన్ రెడ్డి క్రమశిక్షణతో పని చేశారని, ఆయన పార్టీలోనే ఉండి ఉంటే బాగుండేదని ఎంపీ మల్లు రవి అన్నారు. జీవన్ రెడ్డి పార్టీ విడిపోవడం చాలా బాధాకరమని, పార్టీలోనే ఉండి తనకు కావాల్సిన దాని గురించి అడిగి ఉండాల్సిందని అన్నారు.

జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడడం చాలా బాధాకరం: ఎంపీ మల్లు రవి
Mallu Ravi

జీవన్ రెడ్డి క్రమశిక్షణతో పని చేశారని, ఆయన పార్టీలోనే ఉండి ఉంటే బాగుండేదని ఎంపీ మల్లు రవి అన్నారు. జీవన్ రెడ్డి పార్టీ విడిపోవడం చాలా బాధాకరమని, పార్టీలోనే ఉండి తనకు కావాల్సిన దాని గురించి అడిగి ఉండాల్సిందని అన్నారు. గొప్ప సిద్ధాంతాలున్న కాంగ్రెస్ పార్టీలో పని చేయడం గొప్ప విషయమని, కొన్ని రాజకీయ సమీకరణాల కారణంగానే అందరికీ పదవులు రావడం లేదని చెప్పారు (Jeevan Reddy).


కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు, తెలంగాణ ప్రజల అవసరాలకు అనుగుణంగానే సీఎం రేవంత్ రెడ్డి పాలన చేస్తున్నారని మల్లు రవి అన్నారు (Mallu Ravi). రేవంత్ రెడ్డి మంచి ప్రజాదరణ ఉన్న నాయకుడని, గొప్ప వ్యూహకర్త అని ప్రశంసించారు. జీవన్ రెడ్డి లాంటి క్రమశిక్షణ గల నాయకులు పార్టీ వీడడం బాధాకరమని, ప్రభుత్వం చక్కని పాలన అందించాలంటే కొంత సర్దుకుపోవాలని సూచించారు.


తాను కూడా గతంలో చాలా అవకాశాలు కోల్పోయానని, అయినా పార్టీలోనే ఉండి పోరాటం చేశానని చెప్పారు (Telangana politics). జీవన్ రెడ్డి మనసు మార్చుకొని పార్టీలో కొనసాగాలని, పరిస్థితులను బట్టి నాయకులకు అవకాశాలు వస్తాయని అన్నారు. మంచి నాయకులకు మంచి అవకాశాలు తప్పకుండా వస్తాయన్నారు.


ఇవి కూడా చదవండి..

యుద్ధం ముగింపుపై ఆశలు.. భారీ లాభాల్లో దేశీయ సూచీలు..


పాకిస్థాన్ నౌకను వెనక్కి పంపించిన ఇరాన్.. హోర్ముజ్ గుండా ప్రయాణానికి అనుమతి నిరాకరణ..

Updated Date - Mar 25 , 2026 | 09:48 PM