Share News

కేసీఆర్‌ చావును కోరుకుంటున్నాం

ABN , Publish Date - Sep 09 , 2026 | 03:27 AM

మాజీ సీఎం కేసీఆర్‌ చస్తేనే రాష్ట్రానికి పట్టిన పీడ విరగడవుతుందని షాద్‌నగర్‌ ఎమ్మె ల్యే వీర్నపల్లి శంకర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు

కేసీఆర్‌ చావును కోరుకుంటున్నాం
Shadnagar Mla

  • ఆయన చస్తేనే రాష్ట్రానికి పట్టిన పీడ విరగడవుతుంది

  • షాద్‌నగర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వీర్నపల్లి శంకర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

హైదరాబాద్‌/ గన్‌పార్క్‌, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం కేసీఆర్‌ చస్తేనే రాష్ట్రానికి పట్టిన పీడ విరగడవుతుందని షాద్‌నగర్‌ ఎమ్మె ల్యే వీర్నపల్లి శంకర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మంగళవారం అసెంబ్లీ గేటు వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌ ఇంటి వద్ద వెయ్యి డప్పులతో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి పట్టిన పీడ కేసీఆర్‌ అని విమర్శించారు. శంకర్‌ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఆయన వ్యాఖ్యలపై పలువురు మంత్రులు, అధికార పార్టీ నేతలు సైతం విస్మయం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అలా మాట్లాడకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఆ వ్యాఖ్యలు తమ పార్టీకి నష్టం చేస్తాయని పలువురు మంత్రులు తెలిపారు.

Updated Date - Sep 09 , 2026 | 03:27 AM