Share News

మహబూబాబాద్‌లో దారుణం.. 8 నెలల పాపను చంపిన తల్లి.. ఆపై ఆత్మహత్యాయత్నం

ABN , Publish Date - Nov 16 , 2026 | 08:26 PM

మహబూబాబాద్ జిల్లా జేత్యాతండాలో అత్యంత హృదయవిదారకమైన ఘటన చోటుచేసుకుంది. అల్లారుముద్దుగా పెంచుకోవాల్సిన ఎనిమిది నెలల పసికందును కన్నతల్లే గొంతు నులిమి అత్యంత దారుణంగా హతమార్చింది.

మహబూబాబాద్‌లో దారుణం.. 8 నెలల పాపను చంపిన తల్లి.. ఆపై ఆత్మహత్యాయత్నం
Mahabubabad

మహబూబాబాద్, నవంబరు16: జిల్లా కేంద్రం పరిధిలోని మహబూబాబాద్ మండలం ధామ్యతండా శివారు జేత్యాతండాలో అత్యంత హృదయవిదారకమైన ఘటన చోటుచేసుకుంది. కన్నతల్లి తన చేతులారా అల్లారుముద్దుగా పెంచుకోవాల్సిన ఎనిమిది నెలల పసిపాప ప్రాణాలు తీసింది. అభం శుభం తెలియని ఆ చిన్నారి పాపను గొంతు నులిమి అత్యంత కిరాతకంగా హతమార్చింది. ఆ తర్వాత తాను కూడా విషం సేవించి బలవన్మరణానికి యత్నించింది. ఈ దారుణ ఘటన ఒక్కసారిగా స్థానిక తండావాసులను, జిల్లా ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది.


ఈ అనూహ్య ఘటనను గుర్తించిన స్థానిక తండావాసులు వెంటనే అప్రమత్తమై, తీవ్ర అపస్మారక స్థితిలో ఉన్న తల్లి సుప్రజను హుటాహుటిన మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్యులు ఆమెకు ప్రాణాపాయం నుండి కాపాడేందుకు తీవ్రంగా శ్రమిస్తూ చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే రంగప్రవేశం చేసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, ఈ దారుణానికి పాల్పడటానికి కుటుంబ కలహాలు లేదా మానసిక కుంగుబాటు వంటి ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లోనూ లోతుగా విచారణ జరుపుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఉదయం నడక, సాయంత్రం నడక.. వీటిలో ఏది ఆరోగ్యానికి మేలు..?

జీవితంలో ఎదగాలంటే..? నాలుగు సింపుల్ సూపర్ టిప్స్..

Updated Date - Nov 16 , 2026 | 08:56 PM