విదేశీ బొగ్గు దిగుమతి పేరిట 3 వేల కోట్ల స్కామ్కు కుట్ర
ABN , Publish Date - Oct 16 , 2026 | 02:52 AM
రాష్ట్రంలో కావాలని బొగ్గు, విద్యుత్ సంక్షోభాన్ని సృష్టించి, ఇప్పుడు దాన్నే సాకుగా చూపి విదేశీ బొగ్గు దిగుమతి పేరుతో రూ.3,000 కోట్ల భారీ స్కాంకు కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
బోత్రా అనే కంపెనీతో
ఒప్పందాలేంటో సీఎం చెప్పాలి
కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న
ఈ కుట్రలను చూస్తూ ఊరుకోం
రేవంత్, కిషన్ రెడ్డి, భట్టికి కేటీఆర్ లేఖ
హైదరాబాద్, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కావాలని బొగ్గు, విద్యుత్ సంక్షోభాన్ని సృష్టించి, ఇప్పుడు దాన్నే సాకుగా చూపి విదేశీ బొగ్గు దిగుమతి పేరుతో రూ.3,000 కోట్ల భారీ స్కాంకు కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలకు గురువారం ఆయన బహిరంగ లేఖ విడుదల చేశారు. టన్నుకు రూ.1,500 కమీషన్ చొప్పున ఏకంగా రూ.3,000 కోట్ల దోపిడీకి చీకటి ఒప్పందాలు చేసుకున్నారని సీఎంపై ఆరోపణలు చేశారు. ‘సింగరేణి ఉత్పత్తి తగ్గుతోంది. బకాయిలు పేరుకుపోతున్నాయి. యాదాద్రికి కేటాయించిన బొగ్గు సరఫరా పరిస్థితిపై సమాధానాల్లేవు. ఇదే సమయంలో విదేశీ బొగ్గు దిగుమతి ప్రతిపాదనలు తెరపైకి తెస్తున్నారు. ఇది కుట్ర కాకుంటే ఏంటి? ఈ పరిణామాలపై సీఎం సమాధానం చెప్పాల’ని డిమాండ్ చేశారు. బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు కలిసి సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసేందుకు పన్నుతున్న ఈ కుట్రలను బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని, అడ్డుకొని తీరతామన్నారు. ‘సింగరేణికి ఉత్పత్తి సామర్థ్యమున్నా.. బొగ్గు వనరులు ఉన్నా... దేశీయ సరఫరాను పెంచే చర్యలు తీసుకోకుండా విదేశీ బొగ్గువైపే మొగ్గు చూపడం వెనక ఉద్దేశం ఏమిట’ని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో బోత్రా లాజిస్టిక్స్ అనే కంపెనీ పాత్ర అత్యంత అనుమానాస్పదంగా కనిపిస్తోందన్నారు. ఏ అర్హతల ఆధారంగా ఈ సంస్థను ఎంపిక చేశారో చెప్పాలని కోరారు. బోత్రాతో సింగరేణి, రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందా లు, టెండర్ల వివరాలు, చెల్లింపులను బహిర్గతం చేయాలని, వాటిపై స్వతం త్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
ధరణి, భూభారతిలో లక్షల ఎకరాల దోపిడీ: ఏలేటి మహేశ్వర్రెడ్డి