భోజనం విషయంలో వివాదం.. డ్రైవర్‌ను చంపేసిన వంట మనిషి..
ABN , Publish Date - Mar 30 , 2026 | 09:07 AM
భోజనం విషయంలో గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. డ్రైవర్‌ను వంట మనిషి అతి కిరాతకంగా హత్య చేశాడు. ఆదివారం కోకాపేటలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
హైదరాబాద్, మార్చి 30: నగరంలో దారుణం చోటుచేసుకుంది. భోజనం విషయంలో గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. డ్రైవర్‌ను వంట మనిషి అతి కిరాతకంగా హత్య చేశాడు. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. కోకాపేటలోని నార్త్ స్టార్ అల్లూరా విల్లాస్‌లోని ఓ విల్లాలో కాంట్రగుంట ధర్మ తేజ అనే వ్యక్తి అద్దెకు ఉంటున్నాడు. పీనుమల్ల కార్తీక్ అనే వ్యక్తి ధర్మ తేజ దగ్గర డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అదే ఇంట్లో ఆళ్లగడ్డకు చెందిన షేక్ బాషా వంట మనిషిగా పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి కార్తీక్ తనకు భోజనం వడ్డించమని షేక్ బాషాను అడిగాడు.
వంట చేస్తున్నానని షేక్ బాషా సమాధానం ఇచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఆ గొడవ చిలికి చిలికి గాలివానలా మారింది. ఈ నేపథ్యంలోనే షేక్ బాషా ఆగ్రహంతో విచక్షణ కోల్పోయాడు. కూరగాయలు కోసే కత్తితో కార్తీక్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడు. షేక్ బాషా దాడిలో కార్తీక్ తీవ్రగాయాలపాలై చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేశాడు. కార్తీక్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి
ఒంటరి వృద్ధులే టార్గెట్.. ఫిల్మ్‌నగర్ సీరియల్ కిల్లర్ అరెస్ట్
కొంప ముంచిన ప్రాంక్.. అడ్డంగా బుక్కైన కారు ఓనర్..