9వ తరగతి బాలిక అనుమానాస్పద మృతి.. ఖమ్మంలో ఘటన
ABN , Publish Date - Mar 15 , 2026 | 06:50 PM
ఖమ్మం జిల్లాలోని వల్లభి బాలికల ఆశ్రమ పాఠశాలలో చదువుకుంటున్న ఒక బాలిక మరణం జిల్లాలో కలకలానికి దారి తీసింది. ఆశ్రమ పాఠశాల సిబ్బందే తమ బిడ్డ మరణానికి కారణమని బాలిక కుటుంబసభ్యులు ఆరోపించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో ఒక బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలానికి దారి తీసింది. ఆమె వల్లభి బాలికా ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. మూడు రోజుల క్రితం ఆ విద్యార్థిని తన అమ్మమ్మతో కలిసి ఇంటికి వెళ్లింది. అక్కడ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో బాలికను కుటుంబసభ్యులు హైదరాబాద్‌కు తరలించారు. అయితే, ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది.
తమ పాప మృతికి ఆశ్రమ పాఠశాల సిబ్బందే కారణమని కుటుంబసభ్యులు ఆరోపించారు. విద్యార్థిని మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ ఎదుట విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు.
ఇవి కూడా చదవండి:
వామ్మో దారుణం.. ఈ ఏనుగు ఎలా దాడి చేసిందో చూడండి..
డుడుమ జలపాతం అందాలకు ఆనంద్ మహీంద్రా ఫిదా