కేబీఆర్ పార్క్ దగ్గర ట్రాఫిక్ ఆంక్షలు.. ఉ.11 గంటల నుంచి ఒంటి గంట వరకు
ABN , Publish Date - Apr 05 , 2026 | 06:42 AM
కేబీఆర్ పార్క్ చుట్టూ ప్రయోగాత్మకంగా మూడు గంటల పాటు వన్‌వేను అమలు చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు. ఆదివారం నుంచే ట్రాఫిక్ మళ్లింపులు మొదలవ్వనున్నాయి.
హైదరాబాద్, ఏప్రిల్ 5: కేబీఆర్ పార్కు వద్ద జరుగుతున్న స్టీల్ ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణ పనుల దృష్ట్యా, ట్రాఫిక్ మళ్లింపులు చేపడుతున్న సంగతి తెలిసిందే. కేబీఆర్ పార్క్ చుట్టూ ప్రయోగాత్మకంగా మూడు గంటల పాటు వన్‌వేను అమలు చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు. ఆదివారం నుంచే ట్రాఫిక్ మళ్లింపులు మొదలవ్వనున్నాయి. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆంక్షలు, మళ్లింపులు అమలు అవుతాయి. త్వరలో ట్రయల్ రన్ రూట్‌లోనే రాకపోకలు సాగనున్నాయి.
పంజాగుట్ట నుంచి మాదాపూర్ వెళ్లే వాహనాలను రోడ్ నెం.2 నుంచి వన్‌వేగా మళ్లించనున్నారు. అదే విధంగా.. రోడ్ నెంబర్ 45 నుంచి పంజాగుట్ట వెళ్లే వాహనాలను చెక్‌పోస్ట్, కేబీఆర్ పార్క్, రోడ్ నెం.2 వైపు మళ్లించనున్నారు. ఇది కేవలం ట్రయల్ రన్ మాత్రమే. ఇందులో సమస్యలు, లోటు పాట్లు తెలుసుకున్నాక భవిష్యత్తులో అమలు చేయాలా లేదా అనేది ట్రాఫిక్ అధికారులు నిర్ణయిస్తారు.
ఇవి కూడా చదవండి
పాక్‌లో పెట్రోల్ ధర రూ.80 తగ్గింపు!
యుద్ధం వేళ సొమ్ము చేసుకుందాం..