Share News

రేపటి నుంచి కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ వన్‌వే అమలు..

ABN , Publish Date - Aug 17 , 2026 | 07:44 PM

రేపు (మంగళవారం) ఉదయం నుంచి కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ వన్‌వే అమలు కానుంది. కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ రెండేళ్లపాటు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.

రేపటి నుంచి కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ వన్‌వే అమలు..
KBR Park Traffic Restrictions

హైదరాబాద్, ఆగస్టు 17: రేపు (మంగళవారం) ఉదయం 6 గంటల నుంచి కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ వన్‌వే అమలు కానుంది. కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ రెండేళ్లపాటు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. గూగుల్‌ మ్యాప్స్‌లో ఇప్పటికే సింగిల్‌ లేన్‌ రూట్‌ అప్‌డేట్‌ అయింది. రేపు ఉదయం నుంచి ట్రాఫిక్‌ నియంత్రణ కోసం 450 మంది సిబ్బంది మోహరించనున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ స్పష్టం చేశారు.


కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ వన్‌వే అమలుపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ సోమవారం సాయంత్రం పెట్టిన పోస్టులో.. ‘బీఆర్ పార్క్ చుట్టూ 360 డిగ్రీల వన్ వే అమలులో ఉంటుంది. వాహనదారులు ఏర్పాటు చేసిన సైనేజ్ బోర్డులను గమనించి, నిర్దేశించిన ప్రదేశాల్లో మాత్రమే లేన్ మారాలి. నిర్ణీత మార్గాలు, ఫ్రీ-లెఫ్ట్ సదుపాయాలను వినియోగించుకోవాలి. రాంగ్-సైడ్ డ్రైవింగ్ చేయవద్దు. ముఖ్యంగా రాత్రి, తెల్లవారుజామున ట్రాఫిక్ తక్కువగా ఉన్న సమయంలో అతివేగంతో ప్రయాణించవద్దు’ అని పేర్కొంది.


ఇవి కూడా చదవండి

పేదల ఆరోగ్యం.. మా బాధ్యత: సీఎం రేవంత్‌రెడ్డి

స్వీట్ షాపు లైసెన్స్ పునరుద్ధరణలో జాప్యం.. ఎఫ్‌డీఏపై హైకోర్టు గుస్సా

Updated Date - Aug 17 , 2026 | 08:38 PM