Share News

యూఏఈ గగనతలం మూసివేతతో తిరిగొచ్చిన విమానం

ABN , Publish Date - Mar 08 , 2026 | 04:20 AM

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రస్‌ అల్‌ ఖైమాకు వెళ్లిన ఇండిగో విమానం యూఏఈ గగనతలం మూసివేతతో తిరిగి వచ్చి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో దిగింది...

యూఏఈ గగనతలం మూసివేతతో తిరిగొచ్చిన విమానం

శంషాబాద్‌ రూరల్‌, మార్చి7 (ఆంధ్రజ్యోతి): శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రస్‌ అల్‌ ఖైమాకు వెళ్లిన ఇండిగో విమానం యూఏఈ గగనతలం మూసివేతతో తిరిగి వచ్చి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో దిగింది. శుక్రవారం రాత్రి 11.18 గంటలకు 66 మంది ప్రయాణికులతో 6ఈ 1495 ఇండిగో విమానం యూఏఈలోని రస్‌ అల్‌ ఖైమా అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరింది. అక్కడికి వెళ్లాక యూఏఈ గగనతలం మూసివేయడంతో విమానం కాసేపు గాల్లో చక్కర్లు కొట్టింది. ఏటీసీ అధికారుల సూచన మేరకు వెనుదిరిగి శనివారం ఉదయం 6.45 శంషాబాద్‌ విమానాశ్రయంలో విమానం దిగింది. కాగా పశ్చిమాసియాలో యుద్ధం మూలంగా పలు దేశాల గగనతలాలు మూసివేయడంతో శంషాబాద్‌ నుంచి వివిధ దేశాలకు వెళ్లాల్సిన 13విమాన సర్వీసులు రద్దయ్యాయి.

ఇవి కూడా చదవండి..

ఇకపై దాడులు చేయం... గల్ఫ్ దేశాలకు సారీ చెప్పిన ఇరాన్ అధ్యక్షుడు

ఇరాన్ బేషరతుగా లొంగిపోవాల్సిందే.. ట్రంప్ స్పష్టీకరణ

Updated Date - Mar 08 , 2026 | 04:20 AM