Share News

హైడ్రాకు రూ.72 కోట్లు

ABN , Publish Date - Jul 28 , 2026 | 06:19 AM

వర్షాకాలంలో అత్యవసర ఖర్చుల కోసం హైడ్రాకు రూ.72 కోట్లు విడుదల చేస్తూ పురపాలక శాఖ పాలనాపరమైన అనుమతులు జారీ చేసింది. ఈ మేరకు సోమవారం జీవో జారీ చేసింది.

హైడ్రాకు రూ.72 కోట్లు

ఇంటర్నెట్ డెస్క్: వర్షాకాలంలో అత్యవసర ఖర్చుల కోసం హైడ్రాకు రూ.72 కోట్లు విడుదల చేస్తూ పురపాలక శాఖ పాలనాపరమైన అనుమతులు జారీ చేసింది. ఈ మేరకు సోమవారం జీవో జారీ చేసింది. సంస్థ నిర్వహణ, వర్షాకాలం అత్యవసర బృందాల ఏర్పాటు, వరద నీటి కాలువల్లో వ్యర్ధాల తొలగింపు, ప్రభుత్వ భూములకు ఫెన్సింగ్‌, ఆక్రమణల తొలగింపు ఖర్చు, ఇతరత్రా పనుల కోసం నిధులు అవసరమని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ పురపాలక శాఖకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో 2026-27 బడ్జెట్‌ కేటాయింపుల నుంచి రూ.50 కోట్లు, అదనంగా మరో రూ.22 కోట్లు ఇవ్వాలని ఆర్ధిక శాఖకు పురపాలక శాఖ సూచించింది. నిధుల వినియోగానికి సంబంధించిన వివరాలను అకౌంటెంట్‌ జనరల్‌కు సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Updated Date - Jul 28 , 2026 | 06:24 AM