పార్లమెంటరీ కమిటీల్లో తెలంగాణ ఎంపీలకు ప్రాధాన్యం
ABN , Publish Date - Oct 04 , 2026 | 07:33 AM
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల్లో తెలంగాణ ఎంపీలకు ప్రాధాన్యం దక్కింది.
న్యూఢిల్లీ, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల్లో తెలంగాణ ఎంపీలకు ప్రాధాన్యం దక్కింది. విదేశీ వ్యవహారాల కమిటీలో కె.లక్ష్మణ్, డీకే అరుణ, అసదుద్దీన్ ఒవైసీ; గృహ, పట్టణ వ్యవహారాల కమిటీలో చామల కిరణ్‌కుమార్‌రెడ్డి; వాణిజ్య వ్యవహారాల కమిటీలో రేణుకా చౌదరి; ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిటీలో బి.పార్థసారథిరెడ్డి, కడియం కావ్య; పరిశ్రమల కమిటీలో ధర్మపురి అర్వింద్, మల్లు రవి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఉన్నారు. సిబ్బంది, ప్రజాఫిర్యాదులు, చట్టం, న్యాయ కమిటీలో ఎం.రఘునందన్‌రావు; సైన్స్, టెక్నాలజీ, పర్యావరణం, వాతావరణ మార్పుల కమిటీలో గడ్డం వంశీకృష్ణ; రవాణా, పర్యాటకం, సాంస్కృతిక కమిటీలో సురేశ్‌కుమార్ షెట్కార్; రసాయనాలు, ఎరువుల కమిటీలో పోరిక బలరాం నాయక్, ఈటల రాజేందర్ సభ్యులుగా ఉన్నారు.
ఇక బొగ్గు, గనులు, ఉక్కు కమిటీలో అనిల్‌కుమార్ యాదవ్; సమాచార ప్రసార, సమాచార సాంకేతిక కమిటీలో రఘురామిరెడ్డి; ఆహారం, ప్రజాపంపిణీ కమిటీలో ఆర్.కృష్ణయ్య; రక్షణ కమిటీలో దామోదర్‌రావుకు చోటు దక్కింది. ఇంధన కమిటీలో వేంనరేందర్‌రెడ్డి, రఘువీర్‌రెడ్డి; సామాజిక న్యాయం, సాధికారత కమిటీలో గోడెం నగేశ్, పెట్రోలియం, సహజవాయువు కమిటీలో వద్దిరాజు రవిచంద్ర సభ్యులుగా నియమితులయ్యారు.