Share News

ఎన్నికల గుర్తుపై జోక్యం చేసుకోలేం: హైకోర్టు

ABN , Publish Date - Sep 30 , 2026 | 06:59 AM

తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుత దశలో ఎలక్షన్‌ గుర్తు కేటాయింపు అంశంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు మంగళవారం పేర్కొంది.

ఎన్నికల గుర్తుపై జోక్యం చేసుకోలేం: హైకోర్టు
Telangana High Court

  • తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ పిటిషన్‌ కొట్టివేత

హైదరాబాద్‌, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుత దశలో ఎలక్షన్‌ గుర్తు కేటాయింపు అంశంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు మంగళవారం పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి థామస్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.


తమ సంఘానికి గతంలో ఉన్న విల్లు-బాణం గుర్తు కాకుండా నిచ్చెన గుర్తు కేటాయించడం చెల్లదంటూ థామస్‌ రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ శ్రీదేవి ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలువిన్న ధర్మాసనం..ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనందున ఈ దశలో జోక్యం చేసుకోలేమని పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టివేసింది.

Updated Date - Sep 30 , 2026 | 06:59 AM