ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్
ABN , Publish Date - Jun 23 , 2026 | 08:16 PM
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రూ.1.20 కోట్ల వరకు ఉచిత జీవిత బీమా పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఎల్లుండి రవీంద్ర భారతిలో ప్రారంభించనున్నారు. సహజ, ప్రమాద మరణాల సందర్భాల్లో ఈ బీమా వర్తించనుంది.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఉచిత జీవిత బీమా పథకాన్ని ఎల్లుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఈ కార్యక్రమం జరగనుంది.
ఈ పథకం కింద అర్హులైన ఉద్యోగులు, పెన్షనర్లకు రూ.1.20 కోట్ల వరకు ఉచిత జీవిత బీమా రక్షణ కల్పించనున్నారు. సహజ మరణం, ప్రమాద మరణం వంటి సందర్భాల్లో బీమా ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఈ పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు బ్యాంకులతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఉద్యోగులు, పెన్షనర్ల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.
Also Read:
వర్షంలో కారు నడుపుతున్నారా? ఈ ట్రిక్ ఫాలో అవ్వండి
తమిళనాడు సీఎం విజయ్‌పై ఉదయనిధి వ్యక్తిగత విమర్శలు!