Share News

అధికార, ప్రతిపక్ష నేతల భూఆరోపణలపై విచారణ జరిపించండి

ABN , Publish Date - Oct 08 , 2026 | 06:57 AM

రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష నేతలు ఒకరిపై ఒకరు చేసుకున్న భూమి సంబంధిత ఆరోపణలపై విచారణ జరిపించాలని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌(ఎ్‌ఫజీజీ) రాష్ట్ర గవర్నర్‌ను కోరింది.

అధికార, ప్రతిపక్ష నేతల భూఆరోపణలపై విచారణ జరిపించండి
Telangana land allegations

  • రాష్ట్ర గవర్నర్‌కు ఎఫ్‌జీజీ లేఖ

హైదరాబాద్‌, అక్టోబరు7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష నేతలు ఒకరిపై ఒకరు చేసుకున్న భూమి సంబంధిత ఆరోపణలపై విచారణ జరిపించాలని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌(ఎ్‌ఫజీజీ) రాష్ట్ర గవర్నర్‌ను కోరింది. ఈమేరకు ఎఫ్‌జీజీ అధ్యక్షుడు ఎం.పద్మనాభరెడ్డి బుధవారం గవర్నర్‌కు లేఖ రాశారు. మాజీ సీఎం కేసీఆర్‌, ఆయన కుటుంబ సభ్యులు రూ.లక్ష కోట్ల విలువైన భూములను కూడబెట్టుకున్నారంటూ సీఎం రేవంత్‌రెడ్డి శాసనసభలో ప్రకటించారని తెలిపారు.


బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు గచ్చిబౌలిలో పలు హోటళ్లు ఉన్నాయని ఆరోపించారన్నారు. ఫ్యూచర్‌ సిటీలో భూకేటాయింపులకు సంబంధించి రేవంత్‌రెడ్డిపై కేటీఆర్‌ ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. ఇలాంటి ఆరోపణలు, ప్రత్యారోపణలతో ప్రజల్లో గందరగోళం నెలకొందన్నారు. ఇలాంటి ఆరోపణలన్నింటిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని ఆయన గవర్నర్‌ను కోరారు.

Updated Date - Oct 08 , 2026 | 06:57 AM