Share News

8న చలో రాజ్‌భవన్‌

ABN , Publish Date - Oct 05 , 2026 | 07:23 AM

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్‌, కమ్యూనిస్టు ఇతర రాజకీయ పార్టీలు డిమాండ్‌ చేశాయి. ఇదే డిమాండ్‌తో ఈ నెల 8న ఉమ్మడిగా ‘ఛలో రాజ్‌భవన్‌’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రకటించాయి.

8న చలో రాజ్‌భవన్‌
Chalo Raj Bhavan protest

  • కమ్యూనిస్ట్‌, కాంగ్రెస్‌ పార్టీల ఆధ్వర్యంలో నిర్వహణ

  • సీఈసీ జ్ఞానేశ్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్‌

  • ఇదే డిమాండ్‌తో 6న కలెక్టరేట్ల మందు ధర్నా

హైదరాబాద్‌, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్‌, కమ్యూనిస్టు ఇతర రాజకీయ పార్టీలు డిమాండ్‌ చేశాయి. ఇదే డిమాండ్‌తో ఈ నెల 8న ఉమ్మడిగా ‘ఛలో రాజ్‌భవన్‌’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రకటించాయి. అంతకుముందు ఈ నెల 6న అన్ని జిల్లాల కలెక్టర్‌ కార్యాలయాల ముందు ధర్నా చేపట్టనున్నట్లు... కేంద్రం స్పందించకుంటే నవంబర్‌ 1న ఢిల్లీలో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రకటించాయి. ఆదివారం సీపీఐ(ఎం) కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, టీజేఎస్‌, సీపీఐ(ఎంఎల్‌), ఎంసీపీఐయూ, న్యూ డెమొక్రసీ, సమాజ్‌వాదీ, ఆర్‌జేడీ పార్టీల నేతలు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా.. కాంగ్రెస్‌ ఎంపీ మల్లురవి, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నర్సింహ, టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ మాట్లాడారు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థకు కీలకమైన ఓటు హక్కును నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ కేంద్రంలోని అధికార బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ, ఎన్నికల వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. సర్‌ పేరుతో దేశవ్యాప్తంగా కోట్లాది ఓట్లను తొలగిస్తూ.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో సర్‌ ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందు 3.28కోట్ల ఓట్లు ఉండగా.. 73లక్షల ఓట్లు తొలగించారన్నారు. ముసాయిదా జాబితాలో 2.68కోట్ల ఓట్లు మాత్రమే ఉన్నాయని.. అందులోనూ 93 లక్షల ఓటర్లకు నోటీసులు జారీ చేశారని తెలిపారు. మొత్తం 1.66 కోట్ల ఓట్లు తొలగించేందుకు ఎన్నికల సంఘం కుట్ర చేస్తోందన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రాజకీయాల్లోకి వస్తా వివేకా హత్యకేసు నిందితుడు సునీల్‌ యాదవ్‌

తెలంగాణలో ఖేలో ఇండియా గేమ్స్‌

Updated Date - Oct 05 , 2026 | 07:23 AM