గణేశ్ మండపాల నమోదు తప్పనిసరి: సజ్జనార్
ABN , Publish Date - Sep 09 , 2026 | 01:06 AM
గణేశ్ మండపాల వివరాలను ఉత్సవ నిర్వాహకులు తప్పనిసరిగా ముందస్తుగానే ఆన్‌లైన్ ద్వారా నమోదు (ఇంటిమేషన్) చేసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ మంగళవారం ప్రకటించారు
ఆన్‌లైన్ పోర్టల్ అందుబాటులోకి తెచ్చిన పోలీసులు
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): గణేశ్ మండపాల వివరాలను ఉత్సవ నిర్వాహకులు తప్పనిసరిగా ముందస్తుగానే ఆన్‌లైన్ ద్వారా నమోదు (ఇంటిమేషన్) చేసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ మంగళవారం ప్రకటించారు. పోలీస్ పోర్టల్ డాట్ టీఎ్‌సపోలీస్ డాట్ జీవోవీ డాట్ ఇన్ ను సందర్శించి నిర్వాహకులు వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. మండపాలు, నిమజ్జన వివరాలు ముందుగా తెలిస్తే ఆయా ప్రాంతాల్లో తగిన ఏర్పాట్లు చేసేందుకు వీలవుతుందని సీపీ తెలిపారు.