Share News

హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం.. డెకరేషన్ వస్తువుల గోదాంలో మంటలు

ABN , Publish Date - Jul 10 , 2026 | 04:59 PM

హైదరాబాద్ చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్నిప్రమాదం సంభవించింది. చాదర్‌ఘాట్ మూసీ నది సమీపంలో ఉన్న ఒక డెకరేషన్ వస్తువుల గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం.. డెకరేషన్ వస్తువుల గోదాంలో మంటలు
Fire Breaks Out at Decoration Goods Warehouse in Hyderabad

హైదరాబాద్, జులై 10: నగరంలోని చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవాళ (శుక్రవారం) అగ్నిప్రమాదం సంభవించింది. చాదర్‌ఘాట్ మూసీ నది సమీపంలో ఉన్న ఓ డెకరేషన్ వస్తువుల గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గోదాంలో ప్లాస్టిక్, థర్మాకోల్, బట్టలు వంటి సులభంగా అంటుకునే డెకరేషన్ వస్తువులు భారీగా నిల్వ ఉంచడంతో.. క్షణాల వ్యవధిలోనే మంటలు గోదాం అంతటా వ్యాపించాయి. దట్టమైన పొగతో పాటు మంటలు పెద్ద ఎత్తున పైకి ఎగిసిపడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.


ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమయ్యారు. రెండు ఫైరింజన్లు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటలు పక్కనే ఉన్న ఇతర భవనాలకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ప్రమాదానికి గల కారణాలు (షార్ట్ సర్క్యూట్ లేదా మరేదైనా కారణమా అనేది) ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ప్రాథమిక సమాచారం అందుతోంది. పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తూ, సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.


Also Read:

తులసి ఆకులు నమిలితే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయా?

ఈ డ్రై ఫ్రూట్స్‌ను మితంగా తినాలి.. ఎక్కువగా తింటే డేంజర్

Updated Date - Jul 10 , 2026 | 05:25 PM