Share News

హైదరాబాద్‌-తాష్కెంట్‌ విమాన సర్వీసు ప్రారంభం

ABN , Publish Date - Sep 30 , 2026 | 06:52 AM

హైదరాబాద్‌ నుంచి ఉజ్బెకిస్థాన్‌ రాజధాని తాష్కెంట్‌కు సెంట్రమ్‌ ఎయిర్‌ నేరుగా విమాన సర్వీసులను మంగళవారం ప్రారంభించారు.

హైదరాబాద్‌-తాష్కెంట్‌ విమాన సర్వీసు ప్రారంభం
Hyderabad Tashkent flight

శంషాబాద్‌ రూరల్‌, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : హైదరాబాద్‌ నుంచి ఉజ్బెకిస్థాన్‌ రాజధాని తాష్కెంట్‌కు సెంట్రమ్‌ ఎయిర్‌ నేరుగా విమాన సర్వీసులను మంగళవారం ప్రారంభించారు. వారానికి రెండుసార్లు నడిచే ఈ సర్వీసుతో దక్షిణ భారత్‌ - మధ్య ఆసియా మధ్య నేరుగా విమాన కనెక్టివిటీ ఏర్పడింది. తాష్కెంట్‌ను కొత్త గమ్యస్థానంగా చేర్చడంతో హైదరాబాద్‌ విమానాశ్రయం అంతర్జాతీయ గమ్యస్థానాల సంఖ్య 27కు చేరింది.


దేశీయంగా మరో 74 గమ్యస్థానాలకు విమాన కనెక్టివిటీ కొనసాగుతోంది. ఈ సందర్భంగా జీఎంఆర్‌ హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం సీఈవో కదీర్‌ కదీరవన్‌ మాట్లాడుతూ.. వైద్య పర్యాటకానికి హైదరాబాద్‌ ముఖ్యమైన గమ్యస్థానంగా ఎదుగుతున్న నేపథ్యంలో కొత్త అంతర్జాతీయ విమాన మార్గాలు ప్రయాణికులకు మరింత ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. ఏరోప్రైమ్‌ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, సీఈవో అభిషేక్‌ గోయల్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 30 , 2026 | 06:52 AM