Share News

హైదరాబాద్ ఉస్మాన్ నగర్‌లో 10.09 ఎకరాలు.. రూ.517 కోట్లకు సొంతం చేసుకున్న రాజపుష్ప

ABN , Publish Date - Apr 23 , 2026 | 09:07 PM

భాగ్యనగర పశ్చిమ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ జోరు తగ్గలేదని మరోసారి నిరూపితమైంది. ఉస్మాన్ నగర్‌లో తాజాగా జరిగిన TGIIC (తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ) ఈ-వేలంలో ప్రముఖ నిర్మాణ సంస్థ రాజపుష్ప ప్రాపర్టీస్ భారీ ధరకు భూమిని దక్కించుకుంది.

హైదరాబాద్ ఉస్మాన్ నగర్‌లో 10.09 ఎకరాలు.. రూ.517 కోట్లకు సొంతం చేసుకున్న రాజపుష్ప
Hyderabad Real Estate Boom

  • TGIIC వేలంలో ప్లాట్ నెం.1 దక్కించుకున్న రాజపుష్ప

  • రూ. 517 కోట్లకు 10.09 ఎకరాల భూమి కొనుగోలు

  • ఎకరానికి సుమారు రూ. 51.25 కోట్లు చెల్లించిన రాజపుష్ప

  • రాజపుష్ప లైఫ్‌స్టైల్ సిటీ పక్కనే భూమి సొంతం

  • 400+ ఎకరాల టౌన్‌షిప్‌కు గేట్వేగా కొత్త ప్రాజెక్ట్

  • ప్రీమియం మాల్ + గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణానికి ప్లాన్

  • ఒస్మాన్ నగర్‌లో భారీ రియల్ ఎస్టేట్ డీల్

హైదరాబాద్, ఏప్రిల్ 23: భాగ్యనగర పశ్చిమ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ జోరు తగ్గలేదని మరోసారి నిరూపితమైంది. ఉస్మాన్ నగర్‌లో తాజాగా జరిగిన TGIIC(తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ) ఈ-వేలంలో ప్రముఖ నిర్మాణ సంస్థ రాజపుష్ప ప్రాపర్టీస్ భారీ ధరకు భూమిని దక్కించుకుంది.

ఎకరానికి రూ.51 కోట్లు..

ఉస్మాన్ నగర్‌లోని ప్లాట్ నం.1 కోసం జరిగిన వేలంలో రాజపుష్ప సంస్థ అత్యధికంగా రూ.517 కోట్లు వెచ్చించి 10.09 ఎకరాల భూమిని చేజిక్కించుకుంది. అంటే ఎకరా భూమి విలువ సగటున రూ.51.25 కోట్లు పలికినట్లయింది. ఈ ప్రాంతంలో ఇది అత్యంత భారీ ధరగా రియల్ ఎస్టేట్ వర్గాలు భావిస్తున్నాయి.


కొత్త ప్రాజెక్ట్ ప్లాన్.. మాల్, గేటెడ్ కమ్యూనిటీ

రాజ పుష్ప డైరెక్టర్ భరత్ రాజ్ రెడ్డి (Bharath Raj Reddy) మాట్లాడుతూ:.. “ఈ భూమి మా టౌన్‌షిప్‌కు ప్రధాన గేట్‌వేలా ఉంటుంది. ఇక్కడ ప్రీమియం రిటైల్ మాల్‌తో పాటు గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఇది మొత్తం ప్రాజెక్ట్ విలువను మరింత పెంచుతుంది” అని అన్నారు.

ఈ భూమిని రాజ పుష్ప సంస్థ తన ప్రతిష్ఠాత్మక 'రాజ పుష్ప లైఫ్‌స్టైల్ సిటీ'కి ఆనుకుని ఉన్నచోటే కొనుగోలు చేయడం విశేషం. సుమారు 400 ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న భారీ టౌన్‌షిప్‌కు ఈ కొత్త స్థలం ఒక గేట్‌వే(ప్రధాన ప్రవేశ మార్గం)లా మారనుంది. ఇక్కడ ఒక ప్రీమియం షాపింగ్ మాల్‌తో పాటు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన గేటెడ్ కమ్యూనిటీ నిర్మించేందుకు సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ఔటర్ రింగ్ రోడ్డు(ORR)కు సమీపంలో ఉండటం, ఐటీ కారిడార్‌కు వేగంగా అనుసంధానమయ్యే అవకాశం ఉండటంతో ఉస్మాన్ నగర్ ప్రాంతానికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. రాజపుష్ప దక్కించుకున్న ఈ ప్లాట్ ద్వారా ఆ ప్రాంత రూపురేఖలు మరింతగా మారనున్నాయి. ఈ భారీ కొనుగోలుతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మళ్లీ కళకళలాడుతోంది. ముఖ్యంగా పశ్చిమ హైదరాబాద్‌లోని భూములకు ఉన్న క్రేజ్ ఈ డీల్ ద్వారా మరోసారి స్పష్టమైంది.


ఇవి కూడా చదవండి...

విజయవాడ కోర్టు భవనంలో నిలిచిన లిఫ్ట్

కేసీఆర్‌పై చర్యలు తీసుకునే దమ్ములేకే మాపై విమర్శలు: కిషన్ రెడ్డి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 23 , 2026 | 11:12 PM