Share News

హైదరాబాద్ ఎర్రగడ్డ ప్రేమ్ నగర్‌లో భారీ చోరీ

ABN , Publish Date - Mar 16 , 2026 | 08:31 PM

హైదరాబాద్‌ సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రగడ్డ ప్రేమ్ నగర్‌లో పట్టపగలే భారీ చోరీ జరిగింది. శుభకార్యానికి వెళ్లిన వ్యక్తి ఇంటిని దొంగలు గుల్లచేశారు. ఏకంగా 14 తులాల బంగారు ఆభరణాలు, కొంత నగదు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్ ఎర్రగడ్డ ప్రేమ్ నగర్‌లో భారీ చోరీ
Hyderabad Prem Nagar Theft News

హైదరాబాద్‌: సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రగడ్డ ప్రేమ్ నగర్‌లో పట్టపగలే భారీ చోరీ జరిగింది. ​శుభకార్యానికి వెళ్లి వచ్చేసరికి దొంగలు ఇంటిని గుల్లచేశారు. సోమనాథ్ నాయక్ అనే వ్యక్తి ఇంట్లో 14 తులాల బంగారు ఆభరణాలు, కొంత నగదు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సనత్ నగర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, క్లూస్ టీమ్ ఆధ్వర్యంలో ఆధారాలు సేకరించారు.


పోలీసులు నాలుగు ప్రత్యేక టీములుగా ఏర్పడి, ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సమాచారం. చోరీ ఎలా జరిగింది? ఎవరెవరు ఉన్నారు? దొంగతనం చేసిన వస్తువులను ఎక్కడికి తీసుకెళ్లారు అనే విషయాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బాబోయ్ పెద్దపులి… 16 రోజులుగా గ్రామాల్లో సంచారం

జనసేన బలోపేతానికి కృషి : నాగబాబు

ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ గుట్టురట్టు.. 11 మంది అరెస్ట్

Read Latest Telangana News

Updated Date - Mar 16 , 2026 | 08:44 PM