డీఆర్‌డీఓ హైదరాబాద్ ఆర్‌సీఐ డైరెక్టర్‌గా.. డాక్టర్ పి. శ్రీహరి బాధ్యతల స్వీకరణ
ABN , Publish Date - Sep 16 , 2026 | 04:56 AM
ఢిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవల్‌పమెంట్ ఆర్గనైజేషన్(డీఆర్‌డీవో)కు చెందిన ప్రతిష్ఠాత్మక రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్‌సీఐ) నూతన డైరెక్టర్‌గా డాక్టర్ పి. శ్రీహరి బాధ్యతలు చేపట్టారు. మంగళవారం, హైదరాబాద్ ఆర్‌సీఐ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.
ఉస్మానియా, నాగార్జున వర్సిటీల పూర్వ విద్యార్థి
క్షిపణి వ్యవస్థల రూపకల్పనలో విశేష సేవలు
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఢిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవల్‌పమెంట్ ఆర్గనైజేషన్(డీఆర్‌డీవో)కు చెందిన ప్రతిష్ఠాత్మక రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్‌సీఐ) నూతన డైరెక్టర్‌గా డాక్టర్ పి. శ్రీహరి బాధ్యతలు చేపట్టారు. మంగళవారం, హైదరాబాద్ ఆర్‌సీఐ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. నాగార్జున యూనివర్శిటీలో బీటెక్, కోయంబత్తూరు పీఎ్‌సజీ కాలేజీ ఆఫ్ టెక్నాలజీ నుంచి మాస్టర్స్ చేసిన ఆయన.. ఉస్మానియా వర్శిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు. మెకానికల్ ఇంజినీరింగ్ ఫెలోషిప్ కోర్సు ద్వారా డీఆర్‌డీవోలో అడుగుపెట్టిన డా. శ్రీహరి.. తొలుత ఎలకా్ట్రనిక్స్ అండ్ రాడార్ డెవల్‌పమెంట్ ఎస్టాబ్లి్‌షమెంట్ (ఎల్‌ఆర్‌డీఈ)లో సైంటి్‌స్టగా ప్రస్థానం ప్రారంభించారు. సుదీర్ఘ కెరీర్‌లో మల్టీ మోడ్ రాడార్, స్లాటెడ్ యాగీ యాంటెన్నా డిజైనింగ్‌తో పాటు కోలార్ రాడార్ రేంజ్‌ను అభివృద్ధిలో అత్యంత కీలకపాత్ర పోషించారు. 2003లో డీఆర్‌డీఎల్‌కు మారిన ఆయన .. లిక్విడ్ ప్రొపెల్లెంట్ డివిజన్‌లో పనిచేశారు. ఇంటర్‌సెప్టర్ మిస్సైల్స్ కోసం డైవర్ట్ అండ్ యాటిట్యూట్ కంట్రోల్ సిస్టమ్(డీఏసీఎస్), కోల్డ్ గ్యాస్ రియాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (ఆర్‌సీఎస్) రూపకల్పనలో కీలక విభాగాలను నడిపించారు. 2019లో ఎంఆర్‌సామ్ (ఐఏఎఫ్) ప్రాజెక్ట్‌కు డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఐఏఎ్‌ఫకు ఈయన నేతృత్వంలోనే మొట్టమొదటి ఫైరింగ్ యూనిట్ సిద్ధమైంది. అనంతర కాలంలో ప్రతిష్ఠాత్మక ఇండియన్ బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ (బీఎండీ) ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా కూడా వ్యవహరించిన డా. శ్రీహరి ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. క్షిపణి వ్యవస్థలపై జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో పదికి పైగా పరిశోధనా పత్రాలనూ ప్రచురించారు.