Share News

లైంగిక వేధింపుల కేసు.. డీ-10 డ్యాన్స్‌ షో విజేత రాజు అరెస్టు..

ABN , Publish Date - Sep 12 , 2026 | 02:50 PM

తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన డీ-10 డ్యాన్స్‌ షో విజేత రాజును హైదరాబాద్ మియాపూర్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఓ యువతిని లైంగికంగా వేధించాడని, సినిమా అవకాశాల పేరుతో మోసం చేశాడని అందిన ఫిర్యాదు ఆధారంగా ఈ నెల 9న కేసు నమోదు అయ్యింది.

లైంగిక వేధింపుల కేసు.. డీ-10 డ్యాన్స్‌ షో విజేత రాజు అరెస్టు..
Dancer Raju Arrest

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన డీ-10 డ్యాన్స్‌ షో విజేత రాజును హైదరాబాద్ మియాపూర్‌ పోలీసులు అరెస్టు చేశారు. లైంగికంగా వేధించాడని, సినిమా అవకాశాల పేరుతో మోసం చేశాడని ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ నెల 9న కేసు నమోదు అయ్యింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుడు రాజును అదుపులోకి తీసుకుని అరెస్ట్‌ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.


అయితే రాజుపై కేసు నమోదు చేసిన విషయాన్ని మియాపూర్‌ పోలీసులు ఇన్ని రోజులు గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ విషయం వెలుగులోకి రావడంతో డ్యాన్స్‌ షో వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు, యువతి చేసిన ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి

సినిమాల్లో అవకాశాల పేరుతో మోసం.. డిస్ట్రిబ్యూటర్ ఇంటి ముందు బాధితుల ధర్నా

హైదరాబాద్ డెవల‌ప్‌మెంట్‌పై సమావేశం ఏర్పాటు చేయండి: సీఎంకు రాజాసింగ్ విజ్ఞప్తి

Updated Date - Sep 12 , 2026 | 02:58 PM