Share News

సీపీ సజ్జనార్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు

ABN , Publish Date - Oct 03 , 2026 | 05:49 AM

ఓ కోర్టు ధిక్కరణ పిటిషన్‌లో వివరణ ఇవ్వాలని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌కు హైకోర్టు నోటీసులు జారీచేసింది

సీపీ సజ్జనార్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు
SAJJANAR

హైదరాబాద్‌, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): ఓ కోర్టు ధిక్కరణ పిటిషన్‌లో వివరణ ఇవ్వాలని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌కు హైకోర్టు నోటీసులు జారీచేసింది. తనపై ఎలాంటి ఎఫ్‌ఐఆర్‌ లేకపోయినా హైదరాబాద్‌ భవానీనగర్‌ సీఐ, ఎస్సై, ఇతర పోలీసులు తన చేతులు కాళ్లు కట్టేసి, కళ్లలో కారం చల్లి, కొట్టారని ఆరోపిస్తూ తలాబ్‌ కట్టకు చెందిన షానవాజ్‌ ఆలం పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై వారు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడతో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన జస్టిస్‌ టీ మాధవీదేవి ధర్మాసనం.. ఆ ఫిర్యాదును పరిశీలించాలని, సీసీటీవీ ఫుటేజ్‌లను తనిఖీ చేయాలని సీపీ సజ్జనార్‌కు ఆదేశాలు జారీచేసింది. సంబంధిత పోలీసులపై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలు జారీచేసినా పోలీసులపై సీపీ విచారణ చేపట్టలేదని పేర్కొంటూ షానవాజ్‌ కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. మళ్లీ విచారణ చేపట్టిన జస్టిస్‌ టీ మాధవీదేవి ధర్మాసనం.. సజ్జనార్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీచేసింది.

Updated Date - Oct 03 , 2026 | 06:39 AM