రాహుల్ జేజమ్మ దిగివచ్చినా మోదీని ఓడించలేరు: ఈటల
ABN , Publish Date - Sep 30 , 2026 | 06:05 AM
‘ఏ సర్వేలో చూసినా ప్రధాని మోదీని ఢీకొట్టే వారే లేరు. ఇంకా పుట్టలేదు. రాహుల్‌గాంధీ కాదు కదా.. ఆయన జేజమ్మ దిగి వచ్చినా మోదీని ఓడించలేరు’ అని ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.
గెలవడం చేతకాక విమర్శలు: అర్వింద్
ఈసీపై ఆరోపణలు సిగ్గుచేటు: ఏలేటి
న్యూఢిల్లీ, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): ‘ఏ సర్వేలో చూసినా ప్రధాని మోదీని ఢీకొట్టే వారే లేరు. ఇంకా పుట్టలేదు. రాహుల్‌గాంధీ కాదు కదా.. ఆయన జేజమ్మ దిగి వచ్చినా మోదీని ఓడించలేరు’ అని ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షంగా విఫలమైన కాంగ్రెస్ అసహనంతో కేంద్ర ఎన్నికల సంఘంపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేసేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. దేశ ప్రజలు అసహ్యించుకుంటున్నప్పటికీ.. ఆయనలో మార్పు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మంగళవారం ఈటల మీడియాతో మాట్లాడారు. సర్‌పై ఉద్యమంతో దేశంలో కాంగ్రెస్ పార్టీ ఖతం కానుందని అన్నారు. ప్రధాని మోదీ కల అయిన ‘కాంగ్రెస్ ముక్త భారత్’ను రాహుల్‌గాంధీ నిజం చేయబోతున్నారని ఎంపీ అర్వింద్ అన్నారు. గెలవడం చేతకాక.. రాజ్యాంగ వ్యవస్థలపై రాహుల్ దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రాహుల్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ధి కోసం ఈసీపై ఆరోపణలు చేయడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటని అన్నారు.