Share News

మోదీని ఎదుర్కొనే దమ్ములేక ఈసీపై నిందలు వేస్తారా?

ABN , Publish Date - Sep 30 , 2026 | 06:09 AM

కాంగ్రెస్‌ పార్టీకి మోదీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే దమ్ములేక సర్‌ ప్రక్రియపై నిందలు మోపుతూ ఎన్నికల సంఘాన్ని టార్గెట్‌ చేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మోదీని ఎదుర్కొనే దమ్ములేక ఈసీపై నిందలు వేస్తారా?
Bandi Sanjay

  • సర్‌ ప్రక్రియతో ఎన్నికల సంఘం చేసిన తప్పేంటి: సంజయ్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీకి మోదీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే దమ్ములేక సర్‌ ప్రక్రియపై నిందలు మోపుతూ ఎన్నికల సంఘాన్ని టార్గెట్‌ చేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ డిమాండ్‌ చేయడం సిగ్గుచేటన్నారు. ‘‘మోదీ ఎందుకు రాజీనామా చేయాలి.. దేశ ప్రజలు మూడుసార్లు వరుసగా గెలిపించినందుకా.. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ గొప్పతనాన్ని, భారతీయుల సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెబుతున్నందుకా.. అభివృద్ధిలో, ఆర్థిక ప్రగతిలో భారత్‌ను అగ్రదేశాల సరసన నిలిపినందుకు రాజీనామా చేయాలా?’’ అని నిలదీశారు.


మోదీ ప్రభుత్వాన్ని బ్రిటీష్‌ పాలనతో పోల్చడం భారత ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేయడమేనని సంజయ్‌ ఒక ప్రకటనలో విమర్శించారు. సర్‌ ప్రక్రియను పకడ్బందీగా అమలు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులే కీలక పాత్ర పోషిస్తున్నారనే స్పృహ లేకుండా కేంద్రంపైనా, ఎన్నికల సంఘంపైనా నిందలు మోపడం సిగ్గుచేటన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించే ఎన్నికల కమిషన్‌ను సైమన్‌ కమిషన్‌తో పోల్చడమంటే ఆకాశంపై ఉమ్మి వేయడమేనని సంజయ్‌ విమర్శించారు.

Updated Date - Sep 30 , 2026 | 06:09 AM